Telugu Global
Business

Tata Punch | జ‌పాన్‌.. కొరియా కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు చెక్‌.. టాటా పంచ్ ఇలా పైపైకి..!

Tata Punch | జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ‌లకు చెందిన వివిధ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ టాటా పంచ్.. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కూ భార‌త్‌లోనే అత్య‌ధికంగా అమ్ముడైన మోడ‌ల్‌గా నిలిచింది.

Tata Punch | జ‌పాన్‌.. కొరియా కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు చెక్‌.. టాటా పంచ్ ఇలా పైపైకి..!
X

Tata Punch | వ్యాగ‌న్ఆర్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌, ఫ్రాంక్స్‌, బ్రెజా, ఎర్టిగా వంటి పాపుల‌ర్ మోడ‌ల్ కార్ల విక్ర‌యంతో భార‌త్ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (జపాన్‌) దే ఆధిపత్యం. రెండో స్థానంలో ఉన్న హ్యుండాయ్ (ద‌క్షిణ కొరియా) సైతం గ్రాండ్ ఐ10 నియోస్‌, ఐ20, వెన్యూ, క్రెటా వంటి మోడ‌ల్స్ విక్ర‌యాల‌తో దూసుకెళ్తున్న‌ది. అయినా దేశీయ ఆటోమొబైల్ దిగ్గంజ టాటా మోటార్స్ టాప్ సెల్లింగ్ మోడ‌ల్ కార్లు పంచ్‌, నెక్సాన్‌ల‌తో మారుతి సుజుకి, హ్యుండాయ్‌ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది.

జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ‌లకు చెందిన వివిధ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ టాటా పంచ్.. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కూ భార‌త్‌లోనే అత్య‌ధికంగా అమ్ముడైన మోడ‌ల్‌గా నిలిచింది. టాటా పంచ్ త‌ర్వాత మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్‌, మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ క్రెటా, టాటా నెక్సాన్ నిలిచాయి.

2024 జ‌న‌వ‌రి- ఏప్రిల్ మ‌ధ్య టాటా పంచ్ 73,121 కార్లు విక్ర‌యిస్తే మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్ 71,386 యూనిట్ల విక్ర‌యంతో రెండో స్థానంలో నిలిచింది. 66,784 కార్ల విక్ర‌యాల‌తో బాలెనో మూడో స్థానంలో ఉంది. ఇక మారుతి సుజుకి బ్రెజా 62,795, హ్యుండాయ్ క్రెటా 60,393 యూనిట్లు విక్ర‌యించ‌గా, ఆరో స్థానంలో నిలిచిన టాటా నెక్సాన్ 56,803 యూనిట్లు విక్ర‌యించింది.

2024 జ‌న‌వ‌రి-ఏప్రిల్ మ‌ధ్య అమ్ముడైన టాప్ సెల్లింగ్ కార్స్‌

టాటా పంచ్ (Tata Punch) - 73,121 యూనిట్లు

మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్ (Maruti Suzuki WagonR) - 71,386 యూనిట్లు

మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) - 66,784 యూనిట్లు

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) - 64,329 యూనిట్లు

మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza) - 62,795 యూనిట్లు

హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) - 60,393 యూనిట్లు

మ‌హీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) - 59,302 యూనిట్లు

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) - 58,583 యూనిట్లు

టాటా నెక్సాన్ (Tata Nexon) - 56,803 యూనిట్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) - 54,628 యూనిట్లు

టాటా పంచ్ స్పెషిఫికేష‌న్స్ ఇలా

టాటా పంచ్ కారు ఇంట‌ర్న‌ల్ కంబుష్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ), ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ (ఈవీ) అవతార్‌లో ల‌భిస్తుంది. ఐసీఈ మోడ‌ల్ కారు 1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ (88 పీఎస్ విద్యుత్‌, 115 ఎన్ఎం టార్క్‌) వెలువ‌రిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ (73 పీఎస్ విద్యుత్‌, 103 ఎన్ఎం టార్క్‌) విత్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

టాటా పంచ్. ఈవీ కారు రెండు మోటార్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 60 కిలోవాట్ల మోటార్ (114 ఎన్ఎం టార్క్‌) 25కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 315 కిమీ దూరం ప్ర‌యాణిస్తుంది. 35 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌తో 90కిలోవాట్ల మోటార్ (190 ఎన్ఎం టార్క్‌), సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. టాటా పంచ్ ఐసీఈ కారు రూ.6.13 ల‌క్ష‌ల నుంచి రూ.10.20 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. టాటా పంచ్.ఈవీ కారు రూ.10.99 ల‌క్ష‌ల నుంచి రూ.15.49 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ల‌భిస్తుంది.

First Published:  30 May 2024 1:27 PM IST
Next Story