Maruti Suzuki Fronx | మారుతి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. 14 నెలల్లోనే బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం క్రాస్ ఓవర్.. ఎన్ని కార్లు అమ్ముడయ్యాయంటే..?!
Maruti Suzuki Fronx | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. భారతీయ కస్టమర్లకు అనునిత్యం అధునాతన టెక్నాలజీతో కార్లను అందించడంలో ముందు నిలుస్తోంది.
Maruti Suzuki Fronx | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. భారతీయ కస్టమర్లకు అనునిత్యం అధునాతన టెక్నాలజీతో కార్లను అందించడంలో ముందు నిలుస్తోంది. మారుతి సుజుకి కార్లలో ప్రీమియం కంపాక్ట్ క్రాస్ ఓవర్ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) సరికొత్త రికార్డు నెలకొల్పింది. మారుతి సుజుకి బాలెనో బేస్‌తో రూపుదిద్దుకున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) మార్కెట్లోకి వచ్చిన 14 నెలల్లోనే 1.50 లక్షల యూనిట్లకు విక్రయించింది. గతేడాది ఏప్రిల్ 24న దేశీయ మార్కెట్లో ‘ఫ్రాంక్స్’ కారును లాంచ్ చేసింది మారుతి సుజుకి.
నాటి నుంచి పది నెలల్లో లక్ష యూనిట్లు విక్రయించిన మారుతి.. మిగతా 50 వేలు కేవలం గత నాలుగు నెలల్లోనే విక్రయించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) 1,34,735 యూనిట్లు విక్రయించింది. గత ఏప్రిల్ లో 14,286 యూనిట్లు విక్రయించింది. దీంతో మొత్తం హోల్ సేల్ విక్రయాల్లో 1,49,021 యూనిట్లకు చేరుకున్నది. అంటే 1.50 లక్షల యూనిట్ల మార్కుకు 979 యూనిట్ల దూరంలో నిలిచిందన్న మాట. దీని ప్రకారం ప్రతి రోజూ 475 మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు విక్రయాలు జరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 26,638 యూనిట్లు, ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 36,839, తృతీయ (అక్టోబర్ - డిసెంబర్) త్రైమాసికంలో 30,916 యూనిట్లు, చివరి త్రైమాసికం (జనవరి -మార్చి)లో 40,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే దూకుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో కొనసాగింది.
గత ఏప్రిల్‌లో మారుతి సుజుకి కార్లలో 14,286 యూనిట్ల విక్రయాలతో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గాఫ్రాంక్స్ నిలిచింది. ఫ్రాంక్స్ కారు తయారీకి ఆధారమైన బాలెనో సేల్స్‌ను కూడా దాటేసిందీ ప్రీమియం క్రాస్ ఓవర్. ఏప్రిల్ లో మారుతి సుజుకి బాలెనో కార్లు 14,049 యూనిట్లు అమ్ముడయ్యాయి. రోజురోజుకు ప్రీమియం, ఫీచర్-ప్యాక్డ్ కార్లకు గిరాకీ పెరుగుతుండటంతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి కార్లకు డిమాండ్ ఎక్కువైంది.