Maruti Suzuki April offers | మారుతి సుజుకి బంపరాఫర్.. ఆ కార్లపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్లు..!
Maruti Suzuki April offers | మార్కెట్‌లో ప్రధాన వాటా తనదే అయినా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లలో వెనుకబడుతోంది. ఈ తరుణంలో ఆయా కార్ల విక్రయాల్లో తన వాటా పెంచుకునేందుకు ఈ నెలలో భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది మారుతి సుజుకి.
Maruti Suzuki April offers | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. మార్కెట్‌లో ప్రధాన వాటా తనదే అయినా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లలో వెనుకబడుతోంది. ఈ తరుణంలో ఆయా కార్ల విక్రయాల్లో తన వాటా పెంచుకునేందుకు ఈ నెలలో భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది మారుతి సుజుకి. నూతన సంవత్సరం (2024-25) ప్రారంభం సందర్భంగా ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ తదితర నెక్సా రేంజ్ కార్లపై ఈ రాయితీలు అందిస్తున్నది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో రాయితీలు ప్రకటించింది. అయితే తన ఎక్స్ఎల్-6, ఫ్లాగ్‌షిప్ మల్టీ పర్పస్ వెహికల్ ఇన్‌విక్టో మోడల్స్‌పై రాయితీలు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా డిస్కౌంట్లలో తేడాలు ఉంటాయి.
మారుతి సుజుకి ఇగ్నిస్‌పై గరిష్టంగా రూ.58 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లపై ఈ రాయితీలు వర్తిస్తాయి.
మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై గరిష్టంగా రూ.53 వేల వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 పొందొచ్చు. అయితే సీఎన్జీ వేరియంట్ మాత్రం క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలకు పరిమితం చేసింది.
మారుతి సుజుకి సియాజ్ కారు మీద గరిష్టంగా రూ.53 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. రూ.25 వేల క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 లభిస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.58 వేల వరకూ బెనిఫిట్లు పొందొచ్చు. క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్‌తోపాటు కార్పొరేట్ డిస్కౌంట్లతో కలిపి పూర్తి స్థాయి హైబ్రీడ్ వేరియంట్లపై రూ.84 వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై వేర్వేరు బెనిఫిట్లు ఆఫర్ చేస్తున్నది.
మారుతి సుజుకి జిమ్నీ పై గరిష్ట ఆఫర్లు అందిస్తున్నది. టాప్ వేరియంట్ జిమ్నీ ఆల్ఫా ట్రిమ్‌పై గరిష్టంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఎంట్రీ లెవల్- 2024 మోడల్ జిమ్నీ కారుపై రూ.50 వేల వరకూ మాత్రమే డిస్కౌంట్లు అందిస్తున్నది.