మార్కెట్లు అల్లకల్లోలం
మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 11 లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.48 గంటల సమాయానికి సెన్సెక్స్ 1729 పాయింట్లు నష్టపోయి 82,535 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ కూడా 540 పాయింట్లు నష్టపోయి 25,256 వద్ద ట్రేడవుతున్నది. పశ్చిమాసియాలోఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెరుగుతున్న ముడి చమురు ధరలు, చైనా ఉద్దీపన ప్యాకేజీ, జపాన్ కీలక రేట్లను పెంచే అవకాశం లాంటి స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపెడుతున్నాయి.సెన్సెక్స్, నిఫ్టీలు 1.6 శాతనికి పైగా క్షీణించాయి. ప్రతికూల మార్కెట్ సెంటిమెంట్ మధ్య అస్థిరత పెరగడానికి కారణం.
గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రాంభంకాగానే సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. . ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్లు పతనమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 693 పాయింట్లు తగ్గి 83,572 వద్ద కొనసాగింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 25,585 వద్ద ట్రేడైంది. మధ్యాహ్నం 12 తర్వాత సెన్సెక్స్ 1300 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయింది.సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్నీ షేర్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, బీపీసీఎల్, ఏసియన్ పెయింట్స్, ఎల్‌అండ్, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 11 లక్షల కోట్లు ఆవిరైంది. పశ్చిమాసియాలో భయాలు నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్నాళ్లు 70-71 డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.