Mahindra XUV 3XO | మహీంద్రా కంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆవిష్కరణ.. రూ.7.49 లక్షల నుంచి షురూ..!
Mahindra XUV 3XO | మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన కంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Mahindra XUV 3XO | మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన కంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.7.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 18 వేరియంట్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఏఎక్స్7 ఎల్ (AX7 L) వేరియంట్ రూ.15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) అప్‌డేటెడ్ వర్షన్‌గా న్యూ కంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) వస్తున్నది.
పవర్‌ట్రైన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు, ఎంట్రీ అండ్ మిడ్ లెవల్ వేరియంట్లు 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ మోటార్‌తో వస్తున్నాయి. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌గా వస్తుంది. దీంతోపాటు 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్ వెలువరించడంతోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో పోలిస్తే, ఏఎంటీ వర్షన్ అదనంగా రూ.80 వేలు ఎక్కువ.
మోస్ట్ పవర్‌ఫుల్ ఆప్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) వేరియంట్ 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 129 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఈ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
మహీంద్రా 3ఎక్స్ఓ (Mahindra 3XO) డిజైన్‌లో గణనీయ మార్పులు జరిగాయి. అప్ ఫ్రంట్‌లో రీ డిజైన్డ్ బంఫర్, న్యూ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డిస్టినిక్టివ్ కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్, సీ-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, టెయిల్ లైట్ కంటే రేర్ బంపర్‌పై నంబర్ ప్లేట్ ఉంటుంది. హయ్యర్ వేరియంట్లలో నూతన సెట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ క్యాబిన్‌లో మాదిరిగా మహీంద్రా 3ఎక్స్ఓ (Mahindra 3XO) లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యుయల్ టోన్ క్లైమేట్ కంట్రోల్, 10.25-అంగుళాల స్క్రీన్ ఫర్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లే వంటి క్రియేటర్ కంఫర్ట్స్, హయ్యర్ వేరియంట్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 నుంచి 2-లెవల్ అడాస్ ఫీచర్లు ఉంటాయి. వెన్యూ, సొనెట్ తర్వాత లెవల్ 2 అడాస్ స్థాయి సేఫ్టీ ఫీచర్లు వాడటం ఇదే మొదటి సారి. ఇంకా సేఫ్టీ కోసం మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో వాడిన 6-ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ మౌంట్స్, రేర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) ఫీచర్స్ ఉంటాయి. కొన్ని వేరియంట్లలో డ్యుయల్ టోన్ పెయింట్స్‌తోపాటు ఏడు ఎక్స్‌టీరియర్ కలర్స్‌లో వస్తాయి. ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, నెబులా బ్లూ, డ్యూన్ డస్ట్, సిట్రిన్ ఎల్లో రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి.