Telugu Global
Business

Mahindra Bolero Neo+ | మ‌హీంద్రా 9-సీట‌ర్ బొలెరో నియో ఫ్ల‌స్ ఆవిష్క‌ర‌ణ‌.. రూ.11.39 ల‌క్ష‌ల నుంచి షురూ..!

Mahindra Bolero Neo+ | దేశీయ కార్ల త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ (Mahindra Bolero Neo+) ఎస్‌యూవీ కారును భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Mahindra Bolero Neo+ | మ‌హీంద్రా 9-సీట‌ర్ బొలెరో నియో ఫ్ల‌స్ ఆవిష్క‌ర‌ణ‌.. రూ.11.39 ల‌క్ష‌ల నుంచి షురూ..!
X

Mahindra Bolero Neo+ | దేశీయ కార్ల త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ (Mahindra Bolero Neo+) ఎస్‌యూవీ కారును భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. రెండు వేరియంట్ల‌లో మ‌హీంద్రా బొలెరో నియో+ కారు అందుబాటులో ఉంటుంది. దీని ధ‌ర రూ.11.39 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. ఆస‌క్తిగ‌ల కార్ల ప్రేమికులు ఆన్‌లైన్‌లో గానీ, స‌మీప డీల‌ర్‌షిప్ వ‌ద్ద గానీ బుక్ చేసుకోవ‌చ్చు. బుక్ చేసుకున్న వారికి కార్ల డెలివ‌రీ త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంది. క‌మ‌ర్షియ‌ల్‌, కుటుంబ అవ‌స‌రాల‌కూ మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ వినియోగించ‌వ‌చ్చు. థ‌ర్డ్ రోలోని ప్యాసింజ‌ర్లు రేర్ నుంచి లోప‌లికి ప్ర‌వేశించ‌వ‌చ్చూ దిగ‌వ‌చ్చు.


మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ రెండు ట్రిమ్స్ - పీ4, పీ10ల్లో ల‌భిస్తుంది. మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ పీ4 ట్రిమ్ రూ.11.39 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌, మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ పీ10 రూ.12.49 ల‌క్షలు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. ఈ కారు 9-సీట‌ర్ వ‌ర్ష‌న్ (2-3-4 లేఔట్‌)లో ల‌భిస్తుంది. సెవెన్ సీట‌ర్ వ‌ర్ష‌న్ బొలెరోతో పోలిస్తే బొలెరో నియో+ కారు వేరియంట్ల వారీగా రూ.1.49 ల‌క్ష‌లు, రూ.ల‌క్ష ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంది.


మ‌హీంద్రా బొలెరో నియో+ ఎస్‌యూవీ కారు డ్యుయ‌ల్-టోన్ బ్లాక్ బైగీ ఇంటీరియ‌ర్‌, 9-అంగుళాల ట‌చ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ విత్ బ్లూటూత్‌, యూఎస్బీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌, ఆల్ ఫోర్ ప‌వ‌ర్ విండోస్‌, ఎల‌క్ట్రిక్ ఓఆర్వీఎంస్‌, హైట్ అడ్జ‌స్ట‌బుల్ ఓఆర్వీఎంస్‌, 4-స్పీక‌ర్లు, 2-ట్వీట‌ర్లు, అల్లాయ్ వీల్స్‌, ఐసోఫిక్స్ మౌంట్స్‌, ఫాలోమీ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచ‌ర్లు వ‌ర్తిస్తాయి. సేఫ్టీ కోసం డ్యుయ‌ల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, రివ‌ర్స్ పార్కింగ్ సెన్స‌ర్స్ విత్ కెమెరా, ఏబీఎస్‌, ఈబీడీ, సెంట్ర‌ల్ లాకింగ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. మ‌హీంద్రా బొలెరో నియో+ మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్లు - నెపోలీ బ్లాక్‌, మేజిస్టిక్ సిల్వ‌ర్‌, డైమండ్ వైట్ రంగుల్లో ల‌భిస్తుంది.

మ‌హీంద్రా బొలెరో నియో ప్ల‌స్ కారు 2.2 లీట‌ర్ల ఎం-హవాక్ డీజిల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 118 బీహెచ్‌పీ విద్యుత్‌, 280 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌తో వ‌స్తుంది. మ‌హీంద్రా థార్‌, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700, స్కార్పియో-ఎన్‌, స్కార్పియో క్లాసిక్ కార్ల‌లోనూ ఈ ఇంజిన్ వినియోగించారు. అయితే ఆయా మోడ‌ల్ కార్ల‌కు అనుగుణంగా ఆయా ఇంజిన్ల‌కు వేర్వేరుగా విద్యుత్ ఉత్పాద‌క‌త సామ‌ర్థ్యం ఉంటుంది.

First Published:  17 April 2024 1:17 PM IST
Next Story