Telugu Global
Business

Gautam Adani - Mukesh Ambani | అదానీ ఆసియా కుబేరుడి హోదాకు చెక్‌.. ఆ హోదా పొందిన ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ ఈయ‌నేనా..!

Gautam Adani - Mukesh Ambani | ప్ర‌పంచ కుబేరుల ర్యాంకుల్లో నాట‌కీయ ఫ‌క్కీలో మార్పులు జ‌రిగిపోతుంటాయి. ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా కొన‌సాగుతున్న అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీని దాటేసి రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు.

Gautam Adani - Mukesh Ambani | అదానీ ఆసియా కుబేరుడి హోదాకు చెక్‌.. ఆ హోదా పొందిన ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ ఈయ‌నేనా..!
X

Gautam Adani - Mukesh Ambani | ప్ర‌పంచ కుబేరుల ర్యాంకుల్లో నాట‌కీయ ఫ‌క్కీలో మార్పులు జ‌రిగిపోతుంటాయి. ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా కొన‌సాగుతున్న అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీని దాటేసి రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ప్ర‌స్తుతం బ్లూంబ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక సంప‌ద‌తో కుబేరులుగా నిలిచిన వారిలో ముకేశ్ అంబానీ 11వ స్థానంలో కొన‌సాగుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీకి సొంతంగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం నాలుగేండ్ల స్థాయిలో భారీగా న‌ష్ట‌పోయాయి. అందులో గౌతం అదానీ ఆధ్వ‌ర్యంలోని అదానీ గ్రూప్ సంస్థ‌ల స్టాక్స్ భారీగా దెబ్బ‌తిన్నాయి. ఫ‌లితంగా గౌతం అదానీ వ్య‌క్తిగ‌త ఆదాయం 25 బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయారు. దీంతో ఆయ‌న ప్ర‌పంచ కుబేరుల్లో 15వ స్థానానికి ప‌డిపోయారు. అదానీ గ్రూప్ సంస్థ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ దాదాపు 45 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు తుడిచిపెట్టుకుపోయింది.

189 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ గ‌ల అదానీ గ్రూపులో 45 బిలియ‌న్ డాల‌ర్ల ఎం-క్యాప్ హ‌రించుకుపోవ‌డం కీల‌క ప‌రిణామం. అదానీ గ్రూప్ సంస్థ‌ల స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మోసాల‌పై షార్ట్ షెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ ఏడాది క్రితం చేసిన ఆరోప‌ణ‌ల త‌ర్వాత అదానీ గ్రూప్ భారీగా న‌ష్ట‌పోయిన త‌ర్వాత‌.. అత్య‌ధికంగా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కోల్పోవ‌డం ఇదే మొద‌టి సారి. బీజేపీ సార‌ధ్యంలోని ఎన్డీఏ కూట‌మికి అవ‌స‌రమైన మెజారిటీ ప్ర‌జలు ఇవ్వ‌క పోవ‌డంతో కేవలం ఒక్క‌రోజే (జూన్ 4) గౌతం అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద 25 శాతం కోల్పోయారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త సంప‌ద 97.5 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.

గ‌త శ‌నివారం వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంటుంద‌ని తేల‌డంతో సోమ‌వారం అదానీ గ్రూప్ స్టాక్స్ పుంజుకోవ‌డంతో సంస్థ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ఒక్క‌రోజే 20 బిలియ‌న్ డాల‌ర్లు పుంజుకున్న‌ది. అంచ‌నాల‌కు అనుగుణంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సార‌ధ్యంలోని ఎన్డీఏ కూట‌మికి మెజారిటీ సీట్లు రాలేద‌ని తేల‌డంతో మంగ‌ళ‌వారం ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఫ‌లితంగా నాలుగున్న‌రేండ్ల క్రితం స్థాయిలో దేశీయ స్టాక్ మార్కెట్‌లు న‌ష్ట‌పోయాయి.

మంగ‌ళ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఒక ఇండెక్స్ మిన‌హా 12 ప్ర‌ధాన ఇండెక్స్‌లు 24 గంట‌ల జీవిత కాల గ‌రిష్టాన్ని న‌మోదు చేశాయి. స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు ఎనిమిది శాతం న‌ష్ట‌పోయాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మంగ‌ళ‌వారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో భారీగా 8.5 శాతం న‌ష్ట‌పోయి, చివ‌ర్లో కొంత పుంజుకున్నాయి. నిఫ్టీ 21,884.5 పాయింట్లు, సెన్సెక్స్ 72,079.05 పాయింట్ల మేర‌కు ప‌త‌నం అయ్యాయి.

First Published:  5 Jun 2024 7:35 AM GMT
Next Story