Telugu Global
Business

జాబ్ vs బిజినెస్ ఏది బెస్ట్? ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?

జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న చాలామంది యూత్‌ను వేధిస్తుంటుంది. అయితే వీటిలో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్స్‌పర్ట్స్ సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.

జాబ్ vs బిజినెస్ ఏది బెస్ట్? ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
X

చదువు పూర్తవ్వగానే ఉద్యోగాల్లో చేరిపోయేవాళ్లు కొందరైతే.. ఏదైనా స్టార్టప్ పెట్టాలని ఆలోచించేవాళ్లు ఇంకొందరు.. అసలీ రెండింటిలో ఏ ఆప్షన్ ఎవరికి సూట్ అవుతుంది? వీటిలో ఉండే లాభాలూ నష్టాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న చాలామంది యూత్‌ను వేధిస్తుంటుంది. అయితే వీటిలో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్స్‌పర్ట్స్ సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.

చాలామంది ఎంచుకునే జాబ్ ఆప్షన్‌కు వస్తే.. జాబ్‌లో సేఫ్టీ ఉంటుంది. కెరీర్ పరంగా అప్‌డేట్ అవుతూ, సంపాదన పెంచుకుంటే మెల్లగా జీవితంలో రాణించొచ్చు. కంఫర్ట్, సేఫ్టీ కోరుకునేవాళ్లు జాబ్‌కు ఓటేయడం మేలు. అలాకాకుండా రిస్క్ ఉన్నా పర్లేదు నలుగురిలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేవాళ్లు బిజినెస్ ట్రై చేయొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఉండేది రిస్క్. మీ ఆలోచన వర్కవుట్ అవ్వకపోతే డబ్బుతో పాటు సమయం కూడా వృథా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి బిజినెస్‌లో నష్టపోతే కెరీర్‌‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కాబట్టి మీ మనస్తత్వాన్ని, మీ స్కిల్స్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి.

ఎక్స్‌పర్ట్స్ సలహా

ఉద్యోగమైనా, వ్యాపారమైనా.. ఒకదాన్ని తక్కువగా మరోదాన్ని గొప్పదానిగా చూడడం మానుకోవాలనేది నిపుణులు చెప్పే మాట. ఉద్యోగం ఒకరకమైన మనస్తత్వానికి సూట్ అవుతుంది. అందులో కూడా కెరీర్‌‌కు బోలెడు స్కోప్ ఉంటుంది. ఉద్యోగంలో రాణిస్తూ కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రిస్క్ తీసుకోకుండా కేవలం స్కిల్స్‌పై ఫోకస్ పెట్టేవారికి ఉద్యోగం మంచి ఆప్షన్ అవుతుందనేది నిపుణుల సలహా. ఇకపోతే మీ దగ్గర కొత్త ఐడియాలు ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగల స్ట్రాటెజీలు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే అప్పుడు బిజినెస్ మంచి ఆప్షన్ అవుతుంది. అయితే పెద్దమొత్తాల్లో అప్పు చేసి బిజినెస్ చేయడం మాత్రం అంత మంచి ఆలోచన కాదు, రిస్క్‌ను బేరీజు వేసుకున్నాకే బిజినెస్‌లో దిగాలనేది నిపుణుల సలహా.

మధ్య మార్గం కూడా..

ఇకపోతే ఈ రెండింటినీ సమన్వయం చేసే మిడిల్‌వే కూడా ఉంది. అదే వ్యాపారాన్ని ఉద్యోగంలా చేయడం. ఉద్యోగం చేస్తూ వ్యాపారంలో అడుగు పెట్టడం. అంటే వ్యాపారం మొదలుపెట్టి అందులో వచ్చే లాభాలను లాభాలుగా చూడకుండా జీతం లాగా నెలనెలా కొంత తీసుకుంటూ మిగతాది ఇతర పెట్టుబడుల్లో పెడుతూ పోవాలి. ఇది వ్యాపారంలో రిస్క్‌ను తగ్గించే స్ట్రాటెజీ. ఇక ఉద్యోగం చేస్తూ వ్యాపారమంటే.. ప్రతినెలా జీతంలో కొంతమొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ పోవడం. పెట్టుబడులు పెట్టడమంటే పరోక్షంగా వ్యాపారం చేస్తున్నట్టే. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఏదేమైనా మరీ కంఫర్ట్ చూసుకోకుండా, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మీ మనసుని అనుసరిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ పోతే రెండింటిలోనూ రాణించొచ్చు.

First Published:  31 May 2024 10:31 AM IST
Next Story