Kinetic E- Luna | కెనెటిక్ లూనా.. మళ్లీ భారత్ మార్కెట్‌లోకి.. 26 నుంచి బుకింగ్స్ షురూ.. ఇదీ స్పెషాలిటీ..!
Kinetic E-Luna | 1970వ దశకం ప్రారంభంలో ప్రతి ఇంటిలోనూ 50-సీసీ లూనా పేరు మార్మోగింది. సైకిల్ నుంచి మోటారు సైకిల్‌కు మారాలనుకున్న వారు.. ప్రత్యేకించి మధ్యతరగతి స్త్రీ, పురుషులకు అందుబాటు ధరలో రూ.2000లకే కెనెటిక్ గ్రూప్ 50-సీసీ లూనా తెచ్చింది.
Kinetic E-Luna | 1970వ దశకం ప్రారంభంలో ప్రతి ఇంటిలోనూ 50-సీసీ లూనా పేరు మార్మోగింది. సైకిల్ నుంచి మోటారు సైకిల్‌కు మారాలనుకున్న వారు.. ప్రత్యేకించి మధ్యతరగతి స్త్రీ, పురుషులకు అందుబాటు ధరలో రూ.2000లకే కెనెటిక్ గ్రూప్ 50-సీసీ లూనా తెచ్చింది. వివిధ కారణాల రీత్యా 2000వ దశకం ప్రారంభంలో లూనా బైక్స్ తయారీ నిలిపేసిన కెనెటిక్ గ్రూప్.. 28 ఏండ్ల తర్వాత ఉత్పత్తి ప్రారంభించింది. లూనాకు గిరాకీ ఉన్న రోజుల్లో ప్రతి రోజూ 2000 యూనిట్లు అమ్ముడయ్యేవి. నాడు మోపెడ్ క్యాటగిరీలో దాదాపు 95 శాతం లూనా`దే అంటే అతి శయోక్తి కాదు. కెనెటిక్ గ్రూప్ తన జీవిత కాలంలో ఐదు లక్షల లూనాలను విక్రయించింది.
ఇప్పుడు, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పుణె కేంద్రంగా పని చేస్తున్న కెనెటిక్ గ్రూప్.. అనుబంధ కెనెటిక్ గ్రీన్.. భారత్ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ అవతారంలో లూనాను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మోపెడ్ పవర్ ట్రైన్ చూడటానికి కొత్తగా ఉంటుంది. ప్రతి రోజూ అవసరాల కోసం సామాన్యుడికి లూనా ఎలా ఉపయోగపడిందో చల్‌మేరీ లూనా, సఫల్తా కీ సవారీ, లూనా వంటి ప్రచార ప్రకటనలు తెలియజేస్తాయి. అంతే కాదు 1980ల్లో కెనెటిక్ బ్రాండ్‌ను నిర్మించడానికి మోపెడ్ ఉపయోగపడింది.
మార్కెట్‌లో పాపులారిటీ పెంచుకోవడంతో కోసం అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ పీయూష్ పాండేను తమ ప్రచారకర్తగా నియమించుకున్నది కెనెటిక్. అంటే ఎలక్ట్రిక్ లూనా కోసం మల్టీ మీడియాలో క్యాంపెయిన్ డిజైన్ చేస్తారు పీయూష్ పాండే. ప్రస్తుతం ఆయన ఒగిల్వీలో అడ్వైజరీ పాత్ర పోషిస్తున్నారు. తొలి ప్రచారం ఈ నెల 26న రిలీజ్ చేస్తారు. ఒగిల్వీ వరల్డ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, సంస్థ భారత్ సీఈఓ పీయూష్ గోయల్ తన 41 ఏండ్ల అనుబంధానికి తెర దించుతూ ఈ నెల ఒకటో తేదీన తన పదవులకు రాజీనామా చేశారు.
కెనెటిక్ గ్రీన్ ఫౌండర్ కం సీఈఓ సులజ్జా ఫిరోదా మోత్వానీ స్పందిస్తూ.. పీయూష్ పాండే సహకారంతో కెనెటిక్ గ్రీన్ మరోమారు మ్యాజిక్ రీక్రియేట్ చేస్తుంది. పీయూష్ పాండే సంస్థ 82.5 కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుత తరానికి అనుగుణంగా ఈ-లూనా పట్ల వ్యామోహం పెంచేలా ప్రచారం ఉంటుంది. చిరస్మరణీయమైన జ్ఞాపకాలను రేకెత్తిస్తూ, త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది ఈ-లూనా అని చెప్పారు.
భారతీయులకు పర్సనల్ చౌక మొబిలిటీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా నూతన ఎలక్ట్రిక్ అవతార్‌లో ఈ-లూనా పని చేస్తుంది. ఈ నెల 26 నుంచి ఈ-లూనా కోసం కెనెటిక్ గ్రీన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తుంది. వచ్చేనెలలో ఈ-లూనాల ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో కొద్ది యూనిట్లు తిరుగుతున్నాయి. వ్యక్తిగత, వాణిజ్య అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లలో ఉత్పత్తి చేయనున్నది కెనెటిక్ గ్రీన్. ప్రారంభంలో ఏటా లక్ష యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.