Telugu Global
Business

మీ నెట్‌బ్యాంకింగ్ సేఫేనా? జాగ్రత్తలు ఇలా..

ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునేందుకు వీలుగా బ్యాంకులు నెట్‌బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. చాలామంది నెట్ బ్యాంకింగ్‌ను వాడుతుంటారు. అయితే ఆన్‌లైన్‌లో పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా నెట్‌బ్యాంకింగ్ వాడేవాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు.

మీ నెట్‌బ్యాంకింగ్ సేఫేనా? జాగ్రత్తలు ఇలా..
X

ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునేందుకు వీలుగా బ్యాంకులు నెట్‌బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. చాలామంది నెట్ బ్యాంకింగ్‌ను వాడుతుంటారు. అయితే ఆన్‌లైన్‌లో పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా నెట్‌బ్యాంకింగ్ వాడేవాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

నెట్ బ్యాంకింగ్ అనేది అడ్వాన్స్‌డ్ బ్యాంకింగ్ సరీస్. ఆన్‌లైన్ ద్వారా అన్నిరకాల బ్యాంకింగ్ సేవలను పొందేందుకు నెట్‌బ్యాంకింగ్ అనుమతిస్తుంది. యూజర్లు బ్యాంక్ కు వెళ్లకుండానే అన్ని రకాల ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌ను నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అయితే ఇక్కడే రిస్క్ కూడా దాగి ఉంది. సరైన సేఫ్టీ టిప్స్ పాటించకపోతే మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదముంది. కాబట్టి నెట్‌బ్యాంకింగ్ యూజర్లు ఎప్పటికప్పుడు అకౌంట్ సేఫ్టీపై ఓ కన్నేసి ఉంచాలి.

హ్యాకర్లు నేరుగా బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయలేరు. కానీ, యూజర్ల పర్సనల్ డేటా లేదా పాస్‌వర్డ్ వంటివి దొంగిలించి అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి నెట్‌బ్యాంకింగ్ యూజర్లు ప్రతీ రెండు మూడు నెలలకోసారి పాస్‌వర్డ్ మారుస్తుండాలి. పాస్‌వర్డ్‌లో ఎనిమిది కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోవాలి. అందులో అప్పర్ కేస్, లోయర్ కేస్, సింబల్, నెంబర్.. ఇలా అన్ని కలగలిపి ఉండాలి.

మొబైల్ నెంబర్ లేదా మెయిల్ వంటివి హ్యాక్ చేయడం ద్వారా కూడా హ్యాకర్లు నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరపగలరు. కాబట్టి నెట్‌బ్యాంకింగ్ వాడేవాళ్లు మెయిల్‌లో వస్తున్న లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెట్ బ్యాంకింగ్ లాగిన్‌కు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ పెట్టుకోవాలి. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన అలర్ట్స్ మీ మొబైల్‌కు రాకపోతుంటే వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి మొబైల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయమని కోరాలి.

ఇకపోతే నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ అయ్యేందుకు సొంత మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌నే వాడాలి. కనెక్ట్ చేసే వైఫై కూడా నమ్మదగినదై ఉండాలి. ల్యా్ప్‌టాప్‌లో యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్స్ ఉంటే ఇంకా మంచిది. నెట్‌బ్యాంకింగ్ లాగిన్ కోసం క్రోమ్ వంటి బ్రౌజర్లనే వాడాలి. దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. బ్రౌజర్‌‌లో ‘ఆటో సేవ్ పాస్‌వర్డ్స్’ ను ఆఫ్‌లో ఉంచుకోవాలి. నెట్‌బ్యాంకింగ్ అకౌంట్ లాగవుట్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్ క్యాచీని క్లియర్ చేస్తే ఇంకా మంచిది.

First Published:  20 May 2024 12:00 PM GMT
Next Story