Telugu Global
Business

హోమ్‌, పర్సలోన్‌లపై తగ్గనున్న వడ్డీ భారం

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో ఈబీఎల్‌ఆర్‌, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లను తగ్గించిన పలు బ్యాంకులు

హోమ్‌, పర్సలోన్‌లపై తగ్గనున్న వడ్డీ భారం
X

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటను 25 బేసిక్‌ పాయింట్లు తగ్గించడంతో దానికి అనుగుణంగా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రిలేటెడ్‌ లెండింగ్‌ రేట్‌ (ఈబీఎల్‌ఆర్‌), రిపో లింక్డ్‌ లిండింగ్‌ రేట్‌ (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)లను పలు బ్యాంకులు తగ్గించాయి. ఆర్‌బీఐ కొన్ని రోజుల క్రితం రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈబీఎల్‌ఆర్‌, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత రుణాల వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎస్‌బీఐ ఈబీఎల్‌ఆర్‌ ను 9.15 శాతం నుంచి 8.90 శాతానికి, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గించింది. దీంతో హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, బిజినెస్‌ లోన్స్‌పై వడ్డీ తగ్గనుంది. దీంతో దీర్ఘకాలం చెల్లించాల్సిన ఈఎంఐల సంఖ్య కూడా కొంతమేరకు తగ్గనుంది. కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించాయి. రుణగ్రహీతలు వడ్డీ రాయితీని పొందాలా లేక.. తగ్గిన వడ్డీకి అనుగుణంగా ఈఎంఐల సంఖ్యను తగ్గించుకోవాలా అనేది సంబంధిత బ్యాంకులను సంప్రదించి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

First Published:  15 Feb 2025 3:04 PM IST
Next Story