పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
అనారోగ్యంతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం తుది శ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు.అనారోగ్యంతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... బుధవారం తుది శ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం. రతన్ టాటా అస్వస్థతకు గురై ఓ అస్పత్రిలో చేరారంటూ సోమవారం వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు వెలువడింది. తాను బాగానే ఉన్నానని, ఆందోళన అక్కరలేదని అందులో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం విషమించిందని, ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్త సంస్థ పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు.
1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. 1990-2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.రతన్ టాటా న్యూయార్క్ కార్నల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పొందారు. 2000లో రతన్ టాటా భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్, 2008లో రెండు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషన్ అందుకున్నారు.
రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.'రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు' అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు.