Telugu Global
Business

లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు

ప్రధాన స్టాక్స్‌లో కొనుగోళ్లకు మదుపర్ల ఆసక్తి

లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రధాన స్టాక్స్‌లో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడంతో షేర్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణిస్తున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 23,833.95 వద్ద ట్రేడవుతున్నది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ ౩౦4 పాయింట్లు పెరిగి 78,811.80వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 23,833.95 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ. 74.69 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు రూ, 2,645 వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జొమాటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

First Published:  2 Jan 2025 10:41 AM IST
Next Story