స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఉన్నప్పటికీ స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఉన్నప్పటికీ స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 80,200 వద్ద, నిఫ్టీ 144.35 పాయింట్లు తగ్గి 24,255 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్లకు దిగువన ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,738.50 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు అదేబాటలో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు గురువారం నికరంగా రూ. 5,062.45 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 3,620.47 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.