Telugu Global
Business

ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లిన సూచీలు

మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం

ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లిన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 76.40డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,943.30 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 479.44 పాయింట్లు తగ్గి 75256.52 వద్ద.. నిఫ్టీ 129.95పాయింట్లు కుంగి 22783.20 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, కోటక్‌మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటాస్టీల్‌, జోమాటో, ఎల్‌అండ్‌ టీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

First Published:  21 Feb 2025 11:04 AM IST
Next Story