స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నమదుపరులు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 81,650 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 44.70 పాయింట్లు పెరిగి 24,650 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.58 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,739.40 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.87 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.