Telugu Global
Business

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జొమాటో, ఎల్‌ అండ్‌టీ షేర్లలో విక్రయాలు సూచీలపై మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ 23,100 దిగువన ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకడం విలువ 86.61 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 80.83 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్స్‌ 2,708.10 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ ఉదయం 76,629.90 వద్ద నష్టాలతో మొదలైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు కోల్పోయి 76,249.72 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1,048.90 పాయింట్ల నష్టంతో 76,330.01 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 345.55 పాయింట్ల నష్టంతో 23,085 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

First Published:  13 Jan 2025 4:35 PM IST
Next Story