భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ
BY Naveen Kamera22 Nov 2024 3:05 PM IST

X
Naveen Kamera Updated On: 22 Nov 2024 3:05 PM IST
ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత, బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ 1,609 పాయింట్లు లాభపడి 78,765 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నిఫ్టీ 483 పాయింట్ల లాభంతో 23,833 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కేసు కారణంగా గురువారం భారీగా నష్టపోయిన అదానీ గ్రూపు షేర్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Next Story