Telugu Global
Business

జీవితకాలం కనిష్టానికి రూపాయి

డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.07

జీవితకాలం కనిష్టానికి రూపాయి
X

రూపాయి విలువ మరింతగా క్షీణించింది. మొదటిసారిగా డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84 దాటి పడిపోయింది. శుక్రవారం డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.07గా నమోదు అయ్యింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లలో ప్రతికూలతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,478.49 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మొదట్లో స్వల్ప లాభాల్లో సాగిన ట్రేడింగ్‌ తర్వాత నష్టాల బాట పట్టింది. క్రితం రోజు ముగింపు 81,611.41 పాయింట్ల కన్నా 230.05 పాయింట్లు కోల్పోయి 81,381.36 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 34.20 పాయింట్లు కోల్పోయి 24,964.25 పాయింట్ల వద్ద ముగిసింది. టీసీఎస్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుజీ, పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి. హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాలు గడించాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ 78.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

First Published:  11 Oct 2024 12:00 PM GMT
Next Story