భారత్‌ది అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ
ప్రపంచ అంతరిక్ష సంస్థలకు అగ్రశ్రేణి సరఫరా గొలుసుగా భారత్ అభివృద్ధి చెందుతుందన్న మోడీ

రానున్న సంవత్సరాల్లో భారత్ అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పిందని ప్రధాని మోడీ అన్నారు. ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025లో పాల్గొన్న మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రపంచ భవిష్యత్తు భారతదేశంలోనే ఉందని ఒక ముఖ్యమైన ఓఈసీడీ ప్రతినిధి అన్నారు. కొన్నిరోజుల కిందట వాతావరణ మార్పుపై ఓ ఐక్యరాజ్యసమితి సంస్థ సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్ అని చెప్పింది. కొన్ని దేశాలు కేవలం మాటలు మాత్రమే చెబితే భారతదేశం ఫలితాలను తెచ్చి చూపిస్తుందని కూడా ఆ సంస్థ తెలిపింది. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష సంస్థలకు అగ్రశ్రేణి సరఫరా గొలుసుగా భారత్ అభివృద్ధి చెందుతుందని మోడీ తెలిపారు. రానున్న ఏళ్లలో వస్త్ర, సాంకేతిక, పర్యాటక రంగాలు కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని మోడీ అన్నారు. జనాభా పరంగా మధ్యప్రదేశ్ ఐదో అతి పెద్ద రాష్ట్రం. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉన్నది రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారించింది. 20 సంవత్సరాలకు ముందు ఇక్కడి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందువరుసలో ఉందన్నారు.