Telugu Global
Business

నష్టాల్లో ముగిసిన సూచీలు

సెన్సెక్స్‌ 81,289.96 వద్ద, నిఫ్టీ 24,548.70 వద్ద ముగిసింది

నష్టాల్లో ముగిసిన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు మాత్రం ఒడుదొడుకులకు లోనై తర్వాత నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్‌ రాణించినప్పటికీ.. మిగిలిన రంగాల షేర్లలో మాత్రం స్తబ్దత నెలకొన్నది. నవంబర్‌ నెలకు సంబంధించి రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నేటి సాయంత్రం వెలువనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించడం విశేషం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.87 గా ఉన్నది. అంతర్జాతీయ బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73.68 వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2747 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ ఉదయం 81,476.76 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అయినప్పటికీ కొద్దిసేపు లాభాల్లో కదలాడింది. తర్వాత నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేదు. సూచీ ఇంట్రాడేలో 81,211.64 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 236.18 పాయింట్ల నష్టంతో 81,289.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, హిందుస్తాన్‌ యూనిలీవర్‌, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

First Published:  12 Dec 2024 4:42 PM IST
Next Story