ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు
160.85 పాయింట్ల నష్టంతో 77,978 వద్ద ట్రేడవుతున్న సెస్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నూతన సంవత్సరానికి ఫ్లాట్‌గా స్వాగతం పలికాయి. మొదటిరోజు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. మార్కెట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ సంకేతాలు పెద్దగా లేకపోవడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీంతో మార్కెట్లు ప్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 160.85 పాయింట్ల నష్టంతో 77,978 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 56.55 పాయింట్లు కుంగి 23,588.25 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, జొమాటో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ. 78.43 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.