Telugu Global
Business

వంటింట్లో గ్యాస్‌ వృథా కాకుండా చిట్కాలు!

వంటిట్లో వృథా చేసే వాటిల్లో గ్యాస్‌ కూడా ఒకటి. తెలియకుండానే రోజూ ఎంతో గ్యాస్ వేస్ట్‌గా పోతుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో.. గ్యాస్‌ వృథా కాకుండా ఆదా చేసుకోవడమే కాకుండా.. వంటను కూడా త్వరగా పూర్తి చేసుకోవచ్చు.

వంటింట్లో గ్యాస్‌ వృథా కాకుండా చిట్కాలు!
X

వంటిట్లో వృథా చేసే వాటిల్లో గ్యాస్‌ కూడా ఒకటి. తెలియకుండానే రోజూ ఎంతో గ్యాస్ వేస్ట్‌గా పోతుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో.. గ్యాస్‌ వృథా కాకుండా ఆదా చేసుకోవడమే కాకుండా.. వంటను కూడా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అదెలాగంటే..

వంట చేసేముందు ప్రతీసారీ బర్నర్‌ రంధ్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్‌ వృథా అవుతుంది.

గ్యాస్‌ స్టౌవ్‌ వెలిగించినపుడు మంట నీలిరంగులో ఉండాలి. ఎరుపు, ఆరెంజ్‌ రంగుల్లో మండుతుంటే గ్యాస్‌ వృథా అవుతున్నట్టు లెక్క. అందుకే అలా వస్తే.. వెంటనే సర్వీసింగ్‌ చేయించాలి.

వంటకు అన్ని వస్తువులను రెడీ చేసుకున్న తర్వాతే గ్యాస్‌ స్టౌవ్‌ను వెలిగించాలి. కాయగూరలను ఉడకబెట్టడానికి తగినంత నీరు మాత్రమే వాడాలి. ఎక్కువ నీరు పోసి వండితే పోషకాలు వృథా కావడమే కాకుండా గ్యాస్‌, సమయం కూడా వృథా అవుతాయి.

చాలాసార్లు తడిగా ఉన్న పాత్రలను అలాగే స్టవ్ పై పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ నీళ్లు ఆవిరి అయ్యే వరకు పాత్ర వేడి కాదు. ఇలా అదనంగా గ్యాస్ ఖర్చవుతుంది. కాబట్టి పాత్రలను స్టవ్‌ మీద పెట్టే ముందే శుభ్రంగా తుడవడం అలవాటు చేసుకోవాలి.

ఫ్రిజ్ లో నుంచి తీసి వేడి చేయాలనుకున్నప్పుడు ఆయా పదార్థాలను కనీసం గంట ముందే బయటకు తీసి ఉంచాలి. చల్లగా ఉన్న పదార్థాలను స్టవ్ పై పెట్టడం వల్ల వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. అలా చాలా గ్యాస్ వృథా అవుతుంది.

కాయకూరలు, పప్పులను ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు. అలాగే కూరగాయలు, అన్నం వండేటప్పుడు పాత్రలపై మూతలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథాకావు. పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్‌ను చాలా వరకూ సేవ్ చేయొచ్చు.

First Published:  29 Jun 2024 12:30 AM GMT
Next Story