Telugu Global
Business

ఎలక్ట్రిక్ బండి వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం బ్యాటరీ సరిగ్గా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ పాడవ్వడం లేదా పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బ్యాటరీల సేఫ్టీ కోసం ‘ఏఐఎస్‌ 156’ పేరిట స్టాండర్డ్స్ తీసుకొచ్చింది.

ఎలక్ట్రిక్ బండి వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!
X

దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం పెరుగుతోంది. రోడ్ల మీద కూడా ఈవీలు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవాళ్లు దాని బ్యాటరీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

పెట్రోల్ ధరలను భరించలేక కొందరు, పర్యావరణంపై మక్కువతో మరికొందరు, నడపడానికి ఈజీగా ఉంటుందని ఇంకొదరు.. ఇలా కారణాలు ఏవైనా.. దేశంలో ఈవీలు వాడేవాళ్ల సంఖ్య మాత్రం బాగానే పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల ఈవీలు నడుస్తున్నాయని ఒక అంచనా. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్‌ తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం బ్యాటరీ సరిగ్గా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ పాడవ్వడం లేదా పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బ్యాటరీల సేఫ్టీ కోసం ‘ఏఐఎస్‌ 156’ పేరిట స్టాండర్డ్స్ తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనం కొనేటప్పుడు బ్యాటరీకి ఈ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఈవీలు వాడేవాళ్లు ఛార్జింగ్‌ పెట్టేందుకు ఒరిజినల్‌ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. బ్యాటరీ, ఛార్జర్‌ను పొడిగా , బాగా వెలుతురు వచ్చేచోట ఉంచాలి.

బ్యాటరీ ఎప్పుడూ పూర్తిగా జీరో కాకూడదు. ఛార్జింగ్‌ ఎప్పుడూ 20 నుంచి 80 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి. బ్యాటరీలను రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేయకూడదు.

ఈవీలను మరీ ఎక్కువ ఎండలో లేదా మరీ చల్లని వాతావరణంలో ఉంచకూడదు. బ్యాటరీలను మండే వస్తువులకు దూరంగా ఉంచాలి. వాటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.

బ్యాటరీ కేసింగ్‌ దెబ్బతిన్నా, అందులోకి నీరు చేరినా వెంటనే దాన్ని పక్కన పెట్టి.. డీలర్‌‌ను కాంటాక్ట్ చేయాలి.

సన్ లైట్ నేరుగా తగిలే చోట బ్యాటరీలను ఉంచకూడదు. వాహనాన్ని వినియోగించిన తర్వాత దాదాపు గంట వరకూ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టకూడదు.

ఈవీ, బ్యాటరీ తయారీ సంస్థలకు కచ్చితంగా ఏఆర్‌ఏఐ (ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంపోర్టెడ్ లేదా సెకండ్ హ్యాండ్ స్కూటర్లు కొనేముందు ఒకటికి రెండు సార్లు టెక్నీషియన్‌తో చెక్ చేయించాలి.

First Published:  1 May 2024 3:30 AM GMT
Next Story