Telugu Global
Business

Gold-Silver Rates | బంగారం భ‌గ‌భ‌గ‌.. వెండి మిల‌మిల‌.. ధ‌ర‌ల‌కు నో బ్రేక్‌.. కార‌ణాలివే..!

Gold-Silver Rates | తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 24 క్యార‌ట్ల బంగారం తులం రూ.71,730, ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం రూ.65,750 వ‌ద్ద స్థిర ప‌డింది.

Gold-Silver Rates | బంగారం భ‌గ‌భ‌గ‌.. వెండి మిల‌మిల‌.. ధ‌ర‌ల‌కు నో బ్రేక్‌.. కార‌ణాలివే..!
X

Gold-Silver Rates | వ‌చ్చే జూన్‌లో కీల‌క వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తామ‌ని యూఎస్ ఫెడ్ రిజ‌ర్వ్ సంకేతాలివ్వ‌డం, హ‌మాస్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం, ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం, ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావంతో పెరిగిపోతున్న ధ‌ర‌లు.. ఆల్ట‌ర్నేటివ్ పెట్టుబ‌డి మార్గంగా బంగారం, వెండిపై ఇన్వెస్ట‌ర్ల చూపులు.. ఫ‌లితంగా బంగారం ధ‌ర భ‌గ‌భ‌గ‌మంటున్న‌ది. త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.72,660తో జీవిత కాల గ‌రిష్టాన్ని తాకింది. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.66,610 వ‌ద్ద స్థిర ప‌డింది.

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.71,630 వ‌ద్ద నిలిచింది. మ‌రోవైపు ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.65,660 ప‌లుకుతున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 24 క్యార‌ట్ల బంగారం ప‌ది గ్రాములు రూ.71,780, ఆభ‌ర‌ణాల తయారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.65,810 వ‌ద్ద స్థిర ప‌డింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యార‌ట్ల బంగారం తులం రూ.71,630, ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ప‌ది గ్రాములు రూ.65,660 వ‌ద్ద ముగిసింది.

ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర రాజ‌ధాని కోల్‌క‌తాలో 24 క్యార‌ట్ల బంగారం తులం రూ.110 పెరిగి రూ.71,730 వ‌ద్ద స్థిర ప‌డింది. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ప‌ది గ్రాములు ధ‌ర రూ.100 వృద్ధి చెంది రూ.65,750 ప‌లికింది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 24 క్యార‌ట్ల బంగారం తులం రూ.71,730, ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం రూ.65,750 వ‌ద్ద స్థిర ప‌డింది.

మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్‌)లో బంగారం తులం ధ‌ర రూ.637 వృద్ధి చెంది రూ.71,080 వ‌ద్ద స్థిర పడితే కిలో వెండి ధ‌ర రూ.1381 వృద్ధి చెంది రూ.82,109 వ‌ద్ద స్థిర ప‌డింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ కాంట్రాక్ట్స్ జూన్ డెలివ‌రీ ధ‌ర రూ.16 పెరిగి రూ.70,652 వ‌ద్ద ముగిస్తే, కిలో వెండి కాంట్రాక్ట్స్ మే డెలివ‌రీ ధ‌ర రూ.835 పెరిగి రూ.81,698 ప‌లుకుతున్న‌ది.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధ‌ర 2350 డాల‌ర్లు ప‌లికింది. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ ఔన్స్ ధ‌ర సైతం 2372.50 డాల‌ర్ల‌తో ఆల్‌టైం గ‌రిష్టాన్ని తాకింది. వెండి ఫ్యూచ‌ర్స్ ఔన్స్ ధ‌ర మూడేండ్ల గ‌రిష్ట స్థాయి 28.19 డాల‌ర్లు ప‌లికింది. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు సైతం దూకుడుగా బంగారం సేక‌ర‌ణ చేప‌ట్ట‌డం కూడా దాని ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణంగా క‌నిపిస్తున్న‌ది.

First Published:  9 April 2024 5:22 AM GMT
Next Story