Telugu Global
Business

Gold Rates | బంగారం ధ‌గ‌ధ‌గ‌లు.. అదే బాట‌లో వెండి.. రూ.71 వేలు దాటిన తులం..!

Gold Rates | తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తులం బంగారం ధ‌ర (24 క్యార‌ట్స్‌) రూ.600 వృద్ధి చెంది రూ.70,470కి చేరుకున్న‌ది.

Gold Rates | బంగారం ధ‌గ‌ధ‌గ‌లు.. అదే బాట‌లో వెండి.. రూ.71 వేలు దాటిన తులం..!
X

Gold Rates | కీల‌క వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తామ‌న్న‌ యూఎస్ ఫెడ్ రిజ‌ర్వ్ ప్ర‌క‌ట‌న‌తో బంగారం, వెండి ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చేస్తున్నాయి. దీనికి తోడు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు కూడా బంగారం నిల్వ‌లు పెంచుకోవ‌డంతో ప‌సిడికి గిరాకీ ఎక్కువైంది. ఫ‌లితంగా అంత‌ర్జాతీయంగా ఇన్వెస్ట‌ర్లు బంగారంపై మొగ్గు చూపుతున్నారు.

ప‌సిడి ధ‌ర ఆల్‌టైమ్ రికార్డులు నెల‌కొల్పుతున్న‌ది. దీంతో అంత‌ర్జాతీయ‌, దేశీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఆల్ టైం గ‌రిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.490 పెరిగి రూ.71,400ల‌కు చేరుకున్న‌ది. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.450 వృద్ధి చెంది రూ.65,450 వ‌ద్ద స్థిర ప‌డింది. కిలో వెండి ధ‌ర రూ.1300 పెరిగి రూ.85,300 వ‌ద్ద స్థిర ప‌డింది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తులం బంగారం ధ‌ర (24 క్యార‌ట్స్‌) రూ.600 వృద్ధి చెంది రూ.70,470కి చేరుకున్న‌ది. ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.500 పెరిగి రూ.64,600 వ‌ద్ద ముగిసింది. కిలో వెండి ధ‌ర రూ.1300 వృద్ధి చెంది రూ.85,300 వ‌ద్ద‌కు చేరుకున్న‌ది.

మ‌ల్టీ క‌మొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్‌)లో 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.70,275 వ‌రకూ దూసుకెళ్లింది. జూన్ ఎక్స్‌పైరీ ధ‌ర రూ.69,908 ప‌లికింది. జూన్ నుంచి వ‌డ్డీరేట్లు త‌గ్గుతాయ‌న్న యూఎస్ ఫెడ్ చైర్మ‌న్ జెరోమ్ పావ‌ల్ చేసిన ప్ర‌క‌ట‌నే బంగారం ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణం అని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అంత‌ర్జాతీయంగా వ‌రుస‌గా ఆరు సెష‌న్ల‌లో బంగారం ధ‌ర ప‌రుగులు తీస్తున్న‌ది. గురువారం కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధ‌ర 2300 డాల‌ర్లు ప‌లుక‌డం ఇదే తొలిసారి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎంసీఎక్స్‌లో బంగారం ధ‌ర‌లు 12 శాతానికి పైగా పెరిగాయి.

First Published:  4 April 2024 9:32 PM IST
Next Story