Gold Rate | ఇక బంగారమే.. రూ.71 వేలకు చేరువలో తులం పసిడి.. కారణాలివే..!
Gold Rate | బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71 వేల చేరువలోకి వచ్చింది.
Gold Rate | త్వరలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడ్ రిజర్వు స్పష్టమైన సంకేతాలివ్వడం.. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతుండటంతో పెట్టుబడి దారులకు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగానే కనిపిస్తున్నది. వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించగానే డాలర్ ఇండెక్స్ లో యూఎస్ డాలర్ విలువ పడిపోగా, యెన్, పౌండ్, ఆస్ట్రేలియా డాలర్ విలువ బలోపేతం అవుతున్నది. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పడిపోతున్నది. ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71 వేల చేరువలోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర 2274.04 డాలర్లు పలికింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.760 పెరిగి రూ.70,020 వద్ద ముగిసింది. ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 వృద్ధి చెంది రూ.64,250 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2,000 వృద్ధి చెంది రూ.81 వేలకు చేరుకున్నది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో బుధవారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.760 పెరిగి రూ.70,910 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.700 వృద్ధితో రూ.65 వేల వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.84,000 వద్ద నిలిచింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.760 పెరిగి రూ.69,870 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 వృద్ధితో రూ.64,100 వద్దకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర రూ.750 పెరిగి రూ.78,250 వద్ద ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.760 వృద్ధితో రూ.69,870లకు చేరుకున్నది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.64,100 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.78,250 వద్ద నిలిచింది.
మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాల్లో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.760 పెరిగి, రూ.69,870 వద్ద ముగిస్తే, ఆభరణాలను తయారు చేయడానికి వాడే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 పెరిగి రూ.64,100 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ.750 పుంజుకుని రూ.78,250 వద్ద ముగిసింది.