టపాసుల నుంచి రక్షణకు ఇన్సూరెన్స్
కొత్త బీమా పథకం తీసుకువచ్చిన ఫోన్ పే.. పది రోజుల వ్యాలిడిటీతో పాలసీ
దీపావళికి కాల్చే టపాసులతో ఎవరైనా గాయపడితే.. అలాంటి వాళ్ల కోసం ప్రముఖ యూపీఏ ప్లాట్ ఫాం ఫోన్ పే కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చింది. టపాసులు కాల్చుతూ ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడితే ఈ బీమా సదుపాయన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 25 నుంచి 10 రోజుల వ్యాలిడిటీతో ఈ ఇన్సూరెన్స్ స్కీం తీసుకువస్తున్నారు. ఫోన్ పే ఎకౌంట్ హోల్డర్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు నలుగురికి ఈ బీమా కవరేజీ వర్తిస్తుంది. బీమా ప్రీమియం తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 25 నుంచి బీమా స్కీం యాక్టివేట్ అవుతుంది. దీపావళి పండుగ నేపథ్యంలో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఈ బీమా పథకాన్ని తీసుకువచ్చామని ఫోన్ పే వెల్లడించింది. ఫోన్ పేలోని ఇన్సూరెన్స్ సెక్షన్ లోకి వెళ్లి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ క్లిక్ చేయాలని, అక్కడ వివరాలు నమోదు చేసి పాలసీ తీసుకోవాలని సూచించింది. రూ.9లతో బీమా ప్రీమియం తీసుకుంటే రూ.25 వేల వరకు ప్రమాద బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే వెల్లడించింది.