శామీర్‌పేట్, మేడ్చల్ కు మెట్రో రైల్ విస్తరణ
డీపీఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
BY Naveen Kamera1 Jan 2025 5:35 PM IST
X
Naveen Kamera Updated On: 1 Jan 2025 5:35 PM IST
నూతన సంవత్సరం రోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న శామీర్‌పేట్, మేడ్చల్ కు మెట్రో రైలు విస్తరించేందుకు ఓకే చెప్పింది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ 22 కి.మీ.లు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ.ల కారిడార్లకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని ఆదేశించింది. ఆ డీపీఆర్ లను మెట్రోరైల్ ఫేజీ -2 'బీ'లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుతో పాటే శామీర్‌పేట, మేడ్చల్ మెట్రో రైల్ కారిడార్ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
Next Story