EPF Balance | 2023-24లో ఈపీఎఫ్ ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఎప్పుడు.. బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలివే..!
EPF Balance | ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్‌స్క్రైబర్ల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించాలని గత ఫిబ్రవరిలో నిర్ణయించింది.
EPF Balance | ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్‌స్క్రైబర్ల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించాలని గత ఫిబ్రవరిలో నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ చెల్లించింది. అయితే, తమ డిపాజిట్లపై గత ఆర్థిక సంవత్సర వడ్డీరేటు ఎప్పుడు తమ ఖాతాల్లో డిపాజిట్ చేస్తారన్న ఆసక్తి ఖాతాదారుల్లో నెలకొంది. త్వరలో ఖాతాదారుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేస్తామని, త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఒక ఖాతాదారుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈపీఎఫ్ఓ పేర్కొంది. వడ్డీ నష్టం ఉండబోదని వివరణ ఇచ్చింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించిన వడ్డీరేటు మొత్తం 28.17 ఈపీఎఫ్ఓ ఖాతాల్లో మార్చినెలాఖరు కల్లా జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ప్రియ సభ్యుడా.. 28.17 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో 2022-23 ఆర్థిక సంవత్సర వడ్డీ జమ చేశాం. సభ్యులు తమ ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో దయచేసి చెక్ చేసుకోండి అని ఈపీఎఫ్ఓ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్)గా పేరొందిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) లో ఉద్యోగుల రిటైర్మెంట్ ప్లాన్ కోసం పొదుపు తప్పనిసరి. ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత కార్పస్ ఫండ్ పొందొచ్చు. ఈపీఎఫ్ సభ్యులు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్ లైన్‌లో గానీ విత్‌డ్రాయల్, ట్రాన్స్‌ఫర్ క్లయిమ్స్ ఫైల్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులు వ్యక్తిగత తమ ఈపీఎఫ్ క్లయిమ్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.
20 మంది, అంతకంటే ఎక్కువ మంది గల వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తప్పనిసరి. ఈపీఎఫ్ఓలో ఖాతాదారైన ప్రతి ఉద్యోగి తన వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగులు 8.33 శాతం, యాజమాన్యం 3.67 శాతం వాటా జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి డిపాజిట్లపై 2022-23లో 8.15 శాతం వడ్డీ చెల్లించిన ఈపీఎఫ్ఓ.. 2023-24లో 8.25 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్ట్ సూచించింది.
ఈపీఎఫ్ చెక్ చేసుకోవడం ఎలాగంటే..!
ఈపీఎఫ్ ఖాతా గల ఉద్యోగి. ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న పీఎఫ్ కాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి నాలుగు మార్గాలున్నాయి. అవేమిటంటే..
ఏ) ఉమాంగ్ యాప్ ఉపయోగించి..
బీ) ఈపీఎఫ్ మెంబర్ ఈ-సేవ పోర్టల్ వినియోగించి..
సీ) మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా..
డీ) ఎస్ఎంఎస్ పంపడం ద్వారా..
ఉమాంగ్ యాప్ ఉపయోగించుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగంటే..!
ఉమాంగ్ యాప్ హోం పేజీలోకి ఈపీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ తేలిగ్గా చెక్ చేసుకోవచ్చు.
స్టెప్ 1: ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టల్ చేసుకోవాలి.
స్టెప్ 2 : మీ మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్ 3: ఆప్షన్లలో ఈపీఎఫ్ఓ ఎంచుకోవాలి.
స్టెప్ 4: పాస్‌బుక్ వ్యూ క్లిక్ చేయాలి.
స్టెప్ 5: యూఏఎన్ ఖాతా నంబర్ నమోదు చేసి, క్లిక్ చేసి ఓటీపీ పొందాలి.
స్టెప్ 6: లాగిన్ సెలెక్ట్ చేయాలి.
స్క్రీన్‌పై మీ పాస్‌బుక్‌లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగంటే..
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయ్ సెక్షన్‌లోకి వెళ్లి మెంబర్ పాస్‌బుక్ మీద క్లిక్ చేయాలి.
మీ యూఏఎన్ ఖాతా నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. అప్పుడు పీఎఫ్ పాస్‌బుక్ పొందొచ్చు. పీఎఫ్‌లో ఉద్యోగి, యాజమాన్యాల భాగస్వామ్యం వివరాలు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ తదితర అంశాలు సవివరంగా తెలియజేస్తుంది.
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, లభించిన పీఎఫ్ వడ్డీ, ఈపీఎఫ్ బ్యాలెన్స్ తదితర అంశాలు పాస్‌బుక్ ద్వారా చూసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగంటే..
మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓలో మీ రిజిస్టర్డ్ యూఏఎన్ నంబర్.. మీ రిజిస్టర్ మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా 77382 99899 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఇటీవల పీఎఫ్ ఖాతాలో మీ భాగస్వామ్య వివరాలు తెలుసుకోవచ్చు.
అందుకోసం మీరు ఇంగ్లిష్‌లో UAN EPFOHO నమోదు చేసి, మీ బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ నమోదు చేస్తే ఇటీవలి ఈపీఎఫ్ డేటా అప్‌డేట్ తెలుసుకోవచ్చు.