తెలంగాణ ఖజానాకు దసరా కిక్కు
11 రోజుల్లో రూ.1,100 కోట్ల లిక్కర్ సేల్స్
BY Naveen Kamera14 Oct 2024 1:24 PM IST

X
Naveen Kamera Updated On: 14 Oct 2024 1:24 PM IST
తెలంగాణ ఖజానాకు దసరా కిక్కు ఇచ్చింది. 11 రోజుల్లోనే రాష్ట్రంలో రూ1,100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 11వ తేదీన ఒక్కరోజే రూ.200.44 కోట్ల విలువైన లిక్కర్ అమ్మగా, 10వ తేదీన రూ.152 కోట్ల విలువైన మద్యం సేల్ చేశారు. ఈంటే రెండు రోజుల్లో 352.44 కోట్ల విలువైన లిక్కర్ కొనుగోళ్లు జరిగాయి. 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే తెలంగాణలో రూ.19,857 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో రూ.36,493 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాలతో సమకూరింది. ఈ ఏడాది రూ.40 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగొచ్చని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
Next Story