డోర్‌స్టెప్ ఏటీయం.. ఇంటికొచ్చి డబ్బులిచ్చే సర్వీస్!
బ్యాంకులో దాచుకున్న డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ లేదా ఏటీయంకు వెళ్లాలి. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే అప్పుడేం చేయాలి? ఇలాంటి వారి కోసమే ఒక సర్వీస్ ఉంది. అదే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’. ఇదెలా పనిచేస్తుందంటే..
బ్యాంకులో దాచుకున్న డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ లేదా ఏటీయంకు వెళ్లాలి. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే అప్పుడేం చేయాలి? ఇలాంటి వారి కోసమే ఒక సర్వీస్ ఉంది. అదే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’. ఇదెలా పనిచేస్తుందంటే..
డబ్బు అవసరమైనప్పుడు ఎక్కడికీ వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే డబ్బు విత్‌డ్రా చేసుకునేలా పోస్టాఫీస్ ఒక సర్వీస్‌ను ఆఫర్ చేస్తోంది. అదే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్). ఏటీయంకు వెళ్లలేని వారికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్‌ను అన్నీ ప్రభుత్వ బ్యాంకులు అందిస్తున్నాయి. బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంటి నుంచే డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అయితే రూ. 10,000 వరకు మాత్రమే లిమిట్. ఈ తరహా విత్‌డ్రాల్స్‌కు ఎలాంటి వివరాలు అవసరం లేదు. కేవలం బయోమెట్రిక్(వేలి ముద్ర) సాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
డోర్‌స్టెప్ విత్ డ్రా కోసం ముందుగా బ్యాంక్ పోర్టల్ లేదా ఫోన్ బ్యాకింగ్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అక్కడ అకౌంట్ వివరాలు, కావల్సిన మొత్తం, దగ్గర్లోని పోస్టాఫీస్ వివరాలు పొందుపరచి రిక్వెస్ట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ ఏజెంట్ మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత దగ్గర్లోని పోస్టాఫీస్ నుంచి పోస్ట్ మ్యాన్ మీ ఇంటికొచ్చి డబ్బు అందజేస్తాడు. బ్యాంక్ నుంచి పోస్టాఫీస్‌కు, కస్టమర్ ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి డబ్బు ఒకట్రెండు రోజుల్లో ఇంటికొస్తుంది. ఈ సర్వీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ippbonline.com) వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.