Telugu Global
Business

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

రెండు వారాలు వరుసగా నష్టపోయిన దేశీయ సూచీలు రాబోయే రోజుల్లో స్థిరీకరించుకుంటాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 సమయంలో సెన్సెక్స్‌ 307 పాయింట్లతో 81,688 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 25,053 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, థామస్‌ కుక్‌ (ఐ), అశోక్‌ బిల్డ్‌కాన్‌, పాలి మెడికేర్‌, డీసీఎం శ్రీరామ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌, సుదర్శన్‌ కెమికల్స్‌, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌, బంధన్‌, సరిగమ ఇండియా బ్యాంక్‌ షేర్లు నష్టాలో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మొత్తం ప్రధాన సూచీలు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.06గా ఉన్నది.

రెండు వారాలు వరుసగా నష్టపోయిన దేశీయ సూచీలు రాబోయే రోజుల్లో స్థిరీకరించుకుంటాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నది. ఇది మార్కెట్‌కు సానుకూలతకు కారణం. ప్రధాన కంపెనీలు తమ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ఈ వారం ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫలితాలు కీలకం కానున్నాయి.

First Published:  14 Oct 2024 9:55 AM IST
Next Story