నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడితో నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో.. నిఫ్టీ 22,850 కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.86 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.96 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,960.30 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 299.99 పాయింట్లు తగ్గి 75639.19వద్ద.. నిఫ్టీ 107.70పాయింట్లు కుంగి 22825.20 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఐటీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, కోటక్‌మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.