లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు లోనైనా క్రమంగా పుంజుకున్న సూచీలు
![లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1402949-market.webp)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు ప్రస్తుతం లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టగా.. సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.85 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.46 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,942.50 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 505.84 పాయింట్ల లాభంతో 76676.92 వద్ద... నిఫ్టీ 102.15 పాయింట్ల లాభంతో 23147.40 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలు కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నది.