ఫాస్టాగ్ రీ చార్జి కొత్త రూల్స్ తెలుసా?
ఆటో పే ఆప్షన్ గురించి కొత్త అప్ డేట్ ఇదే
ఫోర్ వీలర్స్, ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్, మల్టీ యాక్సిల్ వెహికిల్ ఓనర్స్ అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపుల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఫాస్టాగ్ సదుపాయాన్ని గతంలోనే తీసుకువచ్చింది. యూపీఐ ద్వారా ఎవరికి వారే ఫాస్టాగ్ రీచార్జీ చేసుకొని రయ్యిమంటూ టోల్ గేట్స్ క్రాస్ చేస్తున్నారు. ఫాస్టాగ్ రీచార్జ్‌ల కోసం మ్యానువల్ పేమెంట్ విధానంపై ఆధార పడుతున్న వారికి ఒక కొత్త అప్ డేట్ తీసుకువచ్చారు. అదే ఫాస్టాగ్ ఆటో పే (ఆటో పేమెంట్).. ఈమేరకు ఫాస్ట్ రీ చార్జ్ రూల్స్ లోనూ చేర్పులు, మార్పులు చేశారు. ఫాస్టాగ్ ఎకౌంట్ లో బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా, షెడ్యూల్ ప్రకారం నిర్దేశిత డేట్ కు రీచార్జీ చేయాల్సి ఉన్నా.. లింక్‌డ్ బ్యాంక్ ఎకౌంట్ నుంచి రీచార్జీకి అవసరమైన మొత్తం ఆటో డెబిట్ అవుతుంది. దీనికోసం ఫాస్టాగ్ వినియోగదారులు ఆటో డెబిట్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇదివరకు ఉన్నట్టుగా రీచార్జీకి సంబంధించిన ముందస్తు సమాచారం (మెసేజ్ రూపంలో) ఇవ్వకుండానే ఆటోమేటిక్ గా రీచార్జీ జరిగిపోతుంది. వినియోగదారులకు నచ్చితేనే ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు.. ఒకసారి ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్లు వద్దనుకున్నప్పుడు డిజేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. టోల్ గేట్ వెళ్లిన తర్వాత ఫాస్టాగ్ లో ఎమౌంట్ ఉందా లేదా అనే టెన్షన్ పడకుండా ఆటో పే వాహన యజమానులకు ఉపయోగపడుతుంది.