Telugu Global
Business

డీమార్ట్‌ షేర్స్‌ ఢమాల్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 27 వేల కోట్ల మేర ఆవిరి

డీమార్ట్‌ షేర్స్‌ ఢమాల్‌
X

డీమార్ట్‌ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం క్షీణించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో ఈ ఉదయం 9 శాతం మేర క్షిణించాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 27 వేల కోట్ల మేర ఆవిరైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి డీమార్ట్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ. 659.44 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 5 శాతం మేర పెరిగింది. ఆదాయం కూడా 14.41 శాతం పెరిగి రూ. 14,444.50 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఖర్చులు 14.94 శాతం మేర పెరిగినట్లు నివేదించింది. ఈ ఫలితాలు మదుపర్లను మెప్పించడంలో విఫలమయ్యాయి. దీంతో బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్‌ టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించాయి. ఈ కారణంగా డీమార్ట్‌ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు క్విక్‌ కామర్స్‌ సంస్థల నుంచి డీమార్ట్‌కు ఎదురవుతున్న పోటీ కూడా మరోకారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  14 Oct 2024 1:31 PM IST
Next Story