క్రెడిట్ కార్డుల్లో ఉండే ఈ ఫీచర్స్ తెలుసా?
మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు.
మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డుల్లో ఉండే రకరకాల వెసులుబాట్ల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డుల్లో ఉండే ఫీచర్లు, వెసులుబాట్ల గురించి తెలుసుకోవడం ద్వారా ఆర్ధికంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లివీ..
క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు దాని పనితీరు, వాటి వడ్డీ రేట్ల వివరాలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బిల్లు కట్టే ప్రతీసారీ స్టేట్‌మెంట్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏ ఛార్జీ ఎందుకు పడిందో తెలుసుకుని బిల్లు కట్టాలి. అయితే క్రెడిట్ కార్డు వాడేవాళ్లు ఒకరోజు లేట్‌గా బిల్లు కట్టినా ఏమీ కాదనుకుంటారు. అయితే గడువు కేవలం ఒక్కరోజు దాటినా కూడా దానికి రకరకాల లేట్ ఛార్జీలు అప్లై అవుతాయి. ఇవి బిల్లు మొత్తాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. రూ.1000 వరకూ ఒక ఛార్జీ, రూ 3,000 వరకూ ఒక ఛార్జీ ఇలా రకరకాల లేట్ పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు తదుపరి బిల్లింగ్ సైకిల్‌లో యాడ్ అవుతాయి.
క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు కట్టాల్సిన మొత్తం(టోటల్ డ్యూ), కనీస మొత్తం(మినిమం డ్యూ) అని రెండు కనిపిస్తాయి. మొత్తం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది మినిమం డ్యూ కట్టేస్తుంటారు. అంటే మొత్తం బిల్లులో ఐదు శాతం కడితే చాలు. దీనివల్ల మీకు తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ తర్వాత దానిపై అదనపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మినిమం డ్యూ కట్టడం ద్వారా మిగిలిన ఈఎంఐ అమౌంట్ మరుసటి నెల బిల్లుకు బదిలీ అవుతుంది. దానిపై అదనపు వడ్డీ పడుతుంది.
క్రెడిట్ కార్డు కంపెనీలు ఇప్పుడు కొత్తగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనే ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నాయి. అంటే ఒక క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేసుకోవచ్చన్న మాట. ఒకవేళ మీరు వాడుతున్న కార్డు కంపెనీ కంటే ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీరేటును కల్పించినప్పుడు కూడా క్రెడిట్ కార్డుని ఇతర సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా క్రెడిట్ కార్డు లిమిట్‌లో 75 నుంచి 80 శాతం వరకు బ్యాలెన్స్‌ను వేరే సంస్థ క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ ర్ చేసుకోవచ్చు. అలాగే నాలుగైదు క్రెడిట్ కార్డులు వాడుతున్నవాళ్లు కూడా అన్ని కార్డు చెల్లింపులను ఒకే దగ్గరకు చేర్చుకోవచ్చు.
క్రెడిట్ కార్డు సంస్థలు చాలావరకూ ఉచితంగానే కార్డులు అందజేస్తుంటాయి. ఒకవేళ వాడని క్రెడిట్ కార్డులపై మెయిటెనెన్స్ ఛార్జీలు కట్టాల్సి వచ్చినప్పుడు.. కార్డు క్లోజర్ రిక్వెస్ట్ పెట్టుకుని కార్డుని క్లోజ్ చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు కంపెనీలు మెయింటెనెన్స్ ఛార్జీలను రద్దు చేసి ఉచితంగా సర్వీస్ ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తాయి.
ఇకపోతే క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు కోబ్రాండెడ్ కార్డులు తీసుకోవడం ద్వారా షాపింగ్, ట్రావెల్ వంటి రకరకాల అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే బిల్లింగ్ సైకిల్ డేట్స్, బిల్ డేట్లు మార్చుకునేందుకు కూడా క్రెడిట్ కార్లు అవకాశం కల్పిస్తాయి. దీనికై యాప్ లేదా హెల్ప్ లైన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి.