Tata Punch EV | దేశంలోనే తొలి బుల్లి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా పంచ్.ఈవీ ఆవిష్కరణ.. ధర రూ.11 లక్షల నుంచి షరూ..!
Tata Punch EV | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు టాటా పంచ్ ఈవీ ఆవిష్కరించింది.
Tata Punch EV | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు టాటా పంచ్ ఈవీ ఆవిష్కరించింది. దీని ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.14.49 లక్షలు పలుకుతుంది. స్టాండర్డ్ టాటా పంచ్ ఈవీ 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ దూరం ప్రయాణ సామర్థ్యం కలిగి ఉంటుంది. లాంగ్ రేంజ్ టాటా పంచ్ ఈవీ 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తోపాటు సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంటది.
50కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ (50Kw DC fast charger) సాయంతో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం టాటా పంచ్ ఈవీ కారు బ్యాటరీ చార్జి అవుతుంది. ఈ కారు బ్యాటరీ వాటర్ ప్రూఫ్ కలిగి ఉండటంతోపాటు దీనిపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కి.మీ వారంటీ అందిస్తోంది టాటా మోటార్స్. ఏసీటీఐ.ఈవీ ఆర్కిటెక్చర్‌తో టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇదే. భారత్‌లోని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లలో అత్యంత చౌకది.
టాటా పంచ్ ఈవీ కార్ల (Tata Punch EV) బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.21 వేలు టోకెన్ మనీ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ కార్ల మధ్య టాటా పంచ్ ఈవీ నిలుస్తుంది. సిట్రోన్ ఈసీ3 కారుతో టాటా పంచ్. ఈవీ పోటీ పడుతుంది. టాటా పంచ్. ఈవీ కేవలం 9.5 సెకన్లలో 0-100 కి.మీ వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు రెండు ఈ-డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 120 బీహెచ్‌పీ + 190 ఎన్ఎం టార్క్ వర్షన్, 80 బీహెచ్పీ + 114 ఎన్ఎం టార్క్ వర్షన్లలో లభిస్తుంది.
టాటా పంచ్ ఈవీ. కారు రెండు వేరియంట్లు - స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ కారులో 25 కిలోవాట్ల బ్యాటరీ (25kWh battery) ప్యాక్, లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 35 కిలోవాట్ల బ్యాటరీ (35kWh battery) ప్యాక్ అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ కేవలం 3.3కిలోవాట్ల ఏసీ చార్జర్ (3.3kW AC charger) మాత్రమే కలిగి ఉంటే, లాంగ్ రేంజ్ వేరియంట్ 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జింగ్ (50kW DC fast charging) తోపాటు 7.2 కిలోవాట్ల ఏసీ (7.2kW AC) చార్జర్ ఉంటుంది.
స్టాండర్డ్ టాటా పంచ్.ఈవీ కారు ఐదు ట్రిమ్స్- స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ + వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఐదు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో పొందొచ్చు. లాంగ్ రేంజ్ వేరియంట్ మూడు ట్రిమ్స్ - అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ + వేరియంట్లతోపాటు నాలుగు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
టాటా పంచ్.ఈవీ (Tata Punch EV) కారు ఫ్రంట్‌లో స్ప్టిట్ హెడ్ ల్యాంప్ సెటప్ (split headlamp setup), ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ (LED light bar) కలిగి ఉంటుంది. ఫ్రంట్‌లో చార్జింగ్ సాకెట్ అమర్చారు. దిగువన పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన బంపర్ జత చేశారు.
టాటా పంచ్.ఈవీ (Tata Punch EV) రేర్‌లో వై-షేప్డ్ బ్రేక్ లైట్ సెటప్ (Y-shaped brake light setup), రూఫ్ స్పాయిలర్ (roof spoiler), డ్యుయల్ టోన్ బంపర్ (dual-tone bumper) డిజైన్, ఫోర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లతోపాటు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తాయి. బాయ్‌నెట్ కింద స్టోరేజీ కోసం ట్రంక్ ఏర్పాటు చేసిన టాటా మోటార్స్.ఈవీ తొలి కారు ఇదే.
టాటాపంచ్.ఈవీ ఇంటీరియర్‌గా డాష్‌బోర్డ్‌పై 10.25 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ (10.25-inch infotainment screen) ఉంటుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (10.25-inch digital instrument cluster), లార్జ్ టూ-స్పోక్ స్క్రీనింగ్ వీల్ ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో 7.0 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ ఉంటాయి. టాటా నెక్సాన్.ఈవీలో వాడిన రోటరీ డ్రైవ్ సెలక్టర్ (rotary drive selector) లాంగ్ రేంజ్ వేరియంట్‌లో జత చేశారు.
టాటా పంచ్.ఈవీ కారు 360-డిగ్రీ కెమెరా (360-degree camera), లెదరెట్టే సీట్లు, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (electronic parking brake with auto hold), కనెక్టెడ్ కారు టెక్ (connected car tech), వైర్‌లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ (cruise control), న్యూ ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్ (new Arcade.ev app suite), ఆప్షనల్‌గా సన్‌రూఫ్ ఉంటుంది. సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ ఉంటాయి. బ్లైండ్ వ్యూ మానిటర్, అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్ (ISOFIX mount), ఎస్వోఎస్ ఫంక్షన్ తదితర ఫీచర్లు జత చేశారు.
టాటామోటార్స్.ఈవీ నుంచి భారత్ మార్కెట్‌లోకి వచ్చిన నాలుగో ఎలక్ట్రిక్ కారు ఇది. అత్యంత చౌక కూడా. టాటా నెక్సాన్ ఈవీ తర్వాత ఆవిష్కరించిన రెండో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. జనరేషన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ (Generation 2 EV architecture) పై డెవలప్ చేసిన టాటా మోటార్స్.ఈవీ. తొలి కారు టాటా పంచ్.