అప్పు లేదా లోన్స్ తీసుకునేముందు ఇవి ఆలోచించండి!
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సివచ్చినప్పుడు చాలామంది అప్పు లేదా లోన్స్ తీసుకుంటుంటారు. అయితే ఇలా అప్పు తీసుకుంటున్నప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సివచ్చినప్పుడు చాలామంది అప్పు లేదా లోన్స్ తీసుకుంటుంటారు. అయితే ఇలా అప్పు తీసుకుంటున్నప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
అప్పు తీసుకునేముందు అసలు మీ అవసరం గురించి క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. అప్పు తీసుకోకుండా పని జరుగుతుందేమో ఆలోచించాలి. తప్పక అప్పు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తులకు బదులు బ్యాంకులను ఆశ్రయించడం మంచిది.
బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పు తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకి లోన్ దొరుకుతుంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వంటివి మీ ఆర్ధిక స్థోమతను పూర్తిగా పరిశీలించి లోన్స్ ఇస్తుంటాయి. ఇందులో భాగంగా క్రెడిట్ స్కోర్స్, మీ ఆస్తుల వివరాలు తెలుసుకుంటాయి. కాబట్టి లోన్ తీసుకునేముందు మీ పాత లోన్స్ అన్నీ కట్టారో లేదో చెక్ చేసుకోవాలి. ఆస్తుల డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
లోన్ రకాన్ని బట్టి కొన్ని ఫైనాన్స్ సంస్థలు బ్యాంక్ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఉదాహరణకు హోమ్ లోన్స్ విషయంలో బ్యాంకుల కంటే కొన్ని ఇతర ఫైనాన్స్ సంస్థల్లో మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి. అలాగే వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా. కాబట్టి లోన్ తీసుకునేముందు రెండు మూడు సంస్థల్లో ఎంక్వైరీ చేసి డెసిషన్ తీసుకోవడం బెటర్.
చాలామంది ఎలాగూ లోన్ వస్తుంది కదా అని.. కావాల్సినదానికంటే ఎక్కువ లోన్‌కు అప్లై చేస్తుంటారు. దీనివల్ల అనవసరంగా వడ్డి భారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అవసరం మేరకే లోన్ తీసుకోవాలి.
అప్పు లేదా లోన్ తీసుకునేముందు తిరిగి చెల్లించడం గురించి కూడా ఆలోచించాలి. దానికి తగ్గట్టు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. మీ ఆదాయం, ఖర్చులను పరిగణలోకి తీసుకుని తగినట్టుగా ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోవాలి.
లోన్ తీసుకునే ముందు మీకు లోన్ ఇస్తున్న సంస్థల గురించి, ఆయా టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. అన్నీ తెలుసుకుని, ముందస్తు ప్లాన్‌తో అప్లికేషన్ పెడితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ అప్లైచేశాక రిజెక్ట్ అయితే అది మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.