Telugu Global
Business

Maruti 800 | ఈ కారు 1983లో లాంచింగ్.. 2014లో లెఫ్ట్‌.. 31 ఏండ్ల సుదీర్ఘ ప్ర‌స్థానంలో సుమారు 30 ల‌క్ష‌ల యూనిట్ల సేల్స్‌..!

Maruti 800 | కార్ల మార్కెట్లో ప్ర‌తి సెగ్మెంట్‌లో ఒక మోడ‌ల్ కారును తీసుకొచ్చిందీ మారుతి. స్మాల్ సైజ్ కార్ల‌లో భారీగా అమ్ముడు పోయిందా కారు. అదే లెజెండ‌రీ మారుతి 800. మారుతి సుజుకి 1983లో మారుతి 800 కారును ఆవిష్క‌రించింది.

Maruti 800 | ఈ కారు 1983లో లాంచింగ్.. 2014లో లెఫ్ట్‌.. 31 ఏండ్ల సుదీర్ఘ ప్ర‌స్థానంలో సుమారు 30 ల‌క్ష‌ల యూనిట్ల సేల్స్‌..!
X

Maruti 800 | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఆల్టో, వ్యాగ‌న్ఆర్‌, స్విఫ్ట్‌, బాలెనో, బ్రెజా వంటి బెస్ట్ సెల్లింగ్ కార్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ పెట్టింది. కార్ల మార్కెట్లో ప్ర‌తి సెగ్మెంట్‌లో ఒక మోడ‌ల్ కారును తీసుకొచ్చిందీ మారుతి. స్మాల్ సైజ్ కార్ల‌లో భారీగా అమ్ముడు పోయిందా కారు. అదే లెజెండ‌రీ మారుతి 800. మారుతి సుజుకి 1983లో మారుతి 800 కారును ఆవిష్క‌రించింది. ఢిల్లీ కేంద్రంగా జీవిస్తున్న హ‌ర్పాల్ సింగ్ అనే వ్య‌క్తి తొలి మారుతి 800 కారును రూ.47,500 (ఎక్స్ షోరూమ్‌) ధ‌ర‌కు సొంతం చేసుకున్నారు. అంతేకాదు, హ‌ర్పాల్ సింగ్‌కు నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ కారు తాళాలు అంద‌జేశారు.

త‌ర్వాత‌ర్వాత కొత్త మోడ‌ల్ కార్లు వ‌స్తున్నాకొద్దీ మారుతి 800 అమ్మ‌కాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి 2010 నుంచి పూర్తిగా త‌గ్గిపోయాయి. ఇక 2014లో పూర్తి `మారుతి 800`ను మార్కెట్ నుంచి డిస్‌కంటిన్యూ చేసిందీ మారుతి సుజుకి. 31 ఏండ్ల సుదీర్ఘ ప్ర‌యాణంలో మారుతి 800 కారు 29,17,000 యూనిట్లు విక్ర‌యించింది.

మారుతి 800 కంటే నాలుగు కార్లు మాత్ర‌మే అధిక సంఖ్య‌లో అమ్ముడ‌య్యాయి. వాటిలో మారుతి సుజుకి ఆల్టో, హ్యుండాయ్ ఐ10 బ్రాండ్ (ఐ10, ఐ10 గ్రాండ్‌, గ్రాండ్ ఐ10 నియోస్‌), మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్ ఉన్నాయి. మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించిన నాటికి మారుతి 800 కారు 796సీసీ, 3-సిలిండ‌ర్‌, పెట్రోల్ ఇంజిన్ క‌లిగి ఉంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 37 బీహెచ్‌పీ విద్యుత్‌, 59 ఎన్ఎం టార్క్ వెలువ‌రించ‌డంతోపాటు 4-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌తో ప‌ని చేస్తుంది. మారుతి 800 పెట్రోల్ వ‌ర్ష‌న్ విత్ ఎయిర్ కండీష‌న‌ర్ ధ‌ర సుమారు రూ.2.20 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

First Published:  3 May 2024 7:58 AM GMT
Next Story