స్టాక్ మార్కెట్లకు మస్త్ జోష్!
ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు పెరిగిన సంపద
BY Naveen Kamera2 Jan 2025 5:27 PM IST
X
Naveen Kamera Updated On: 2 Jan 2025 5:27 PM IST
కొత్త సంవత్సరం రెండో రోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి. ఉదయం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ట్రేడ్ అవడతంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ)లో ఇన్వెస్టర్ల సంపద రూ.450 లక్షల కోట్లకు చేరింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్ 78,657.62 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన ట్రేడింగ్ ఒకానొక దశలో 80,032.81 పాయింట్లకు పెరిగింది. 79,943.71 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 445.75 పాయింట్లు పెరిగి 24,188.65 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ వేగంగా మరో పది పైసలు క్షీణించి రూ.85.75 ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి సుజుకి, మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్ షేర్లు లాభాలు గడించాయి.
Next Story