Telugu Global
Business

వరుసగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మదుపర్లను మెప్పించకపోవడంతో స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వరుసగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మదుపర్లను మెప్పించకపోవడంతో వరుసగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. కీలకమైన రెపోరేట్‌ను స్థిరంగా ఉంచిన ఆర్‌బీఐ.. క్వాష్‌ రిజర్వ్‌ రేషియోను మాత్రం 50 బేస్‌ పాయింట్లు తగ్గించింది. జీడీపీ వృద్ది మందగించిన వేళ సీఆర్‌ఆర్‌ తగ్గించవచ్చు అన్న అంచనాకు మదుపర్లు ముందే రావడంతో.. ఆర్‌బీఐ ప్రకటన మార్కెట్‌లో జోష్‌ నింపలేదు. దీంతో రోజంతా పెద్దగా మెరుపులు లేకుండానే సూచీలు ఒడుదొడుకుల్లో చలించాయి.డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.69గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.62 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2600 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ ఉదయం 81,887.54 పాయింట్ల వద్ద (కిందటి ముగింపు 81,765.86) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,506.19-81,925.91 మధ్య కదలాడింది. చివరికి 56.74 పాయింట్ల నష్టంతో 81,709.12 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 35.85 పాయింట్ల నష్టంతో 24,672.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ ప్రధానంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాల్లో ముగిశాయి.

First Published:  6 Dec 2024 5:36 PM IST
Next Story