తక్కువ ధరలో మంచి మొబైల్ కావాలా? బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు లేకపోయినా వాడుకునేందుకు సింపుల్‌గా ఉంటూ తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో రూ. పది వేల కంటే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి.
ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు లేకపోయినా వాడుకునేందుకు సింపుల్‌గా ఉంటూ తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో రూ. పది వేల కంటే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి.
పోకో ఎమ్ 6 5జీ
రీసెంట్‌గా లాంఛ్ అయిన పోకో ఎమ్ 6 ఫోన్‌ను.. బెస్ట్ బడ్జెట్ 5జీ మొబైల్‌గా చెప్పుకోవచ్చు. ఇది 6.79 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ధర రూ.9,500 ఉంటుంది.
వివో వై18
బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే వివో వై18 తీసుకోవచ్చు. ఇది 6.56 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ధర రూ. - రూ.9,000 ఉంటుంది.
మోటో జీ42 పవర్
బడ్జెట్‌లో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ కావాలనుకుంటే మోటో జీ42 పవర్ తీసుకోవచ్చు. ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ధర రూ.9,000 ఉంటుంది.
శాంసంగ్ ఎం14
బడ్జె్ట్‌లో మంచి బ్యాటరీతోపాటు మంచి డిస్‌ప్లే కూడా ఉండే మొబైల్ కావాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 14 మొబైల్ తీసుకోవచ్చు. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. శాంసంగ్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6,000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు 2 ఎంపీ కెమెరాలతో పాటు 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ధర రూ.11,999 ఉంటుంది.