ఇండియాలో బెస్ట్ ఎలక్టిక్ కార్ ఇదే!
ఇండియాలో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారుగా కామెట్ పాపులర్ అవుతోంది ఈ ఒక్క ఏడాదే 4 వేలకు పైగా యూనిట్ల సేల్స్‌ను ఈ కారు సాధించింది.
ప్రస్తుతం రోడ్లపై చాలానే ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పొల్యూషన్ కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మొగ్గు చూపుతున్నారు. దాంతో మార్కెట్లోకి రకరకాల ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఒక ఈవీ మాత్రం ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోది. అదేంటంటే..
ఈవీలకు మార్కెట్ పెరగడంతో టాటా, మహీంద్రా, హ్యుందాయ్, ఎంజీ, కియా వంటి ఆటోమొబైల్ కంపెనీలు పలు ఈవీ మోడల్స్‌ను లాంఛ్ చేశాయి. అయితే వీటిలో ఎంజీ కామెట్ అనే కారు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇండియాలో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారుగా కామెట్ పాపులర్ అవుతోంది ఈ ఒక్క ఏడాదే 4 వేలకు పైగా యూనిట్ల సేల్స్‌ను ఈ కారు సాధించింది.
ఎంజీ కామెట్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 42పీఎస్ పవర్, 110ఎన్ఎం టార్క్ కు సరిసమానమైన ఎలక్ట్రిక్ పెర్ఫామెన్స్ ను అందిస్తుంది. పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్, ఐపీ67-రేటెడ్ 17.3కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. 7 గంటల్లో కారు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లతో పాటు ముందు వెనుకా కనెక్టింగ్ లైట్లు కూడా ఉంటాయి. స్టీరింగ్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. వీటితోపాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో పాటు యాభైకు పైగా స్మార్ట్ ఫీచర్లు కలిగి ఉంది.
ఎంజీ కామెట్ కారుని ఎక్కువమంది ఇష్టపడడానికి కారణం దాని సైజు, ధర. ఈ కారు చిన్న సైజులో సింపుల్‌గా ఉంటుంది. మూడు డోర్లు ఉంటాయి. నలుగురు కూర్చోవచ్చు. సిటిలో తిరగడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే బేసిక్ మోడల్ ధర రూ. 6.99 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ ఎండ్ ధర రూ. 9.53 లక్షల వరకూ ఉంటుంది.