98.12 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన
BY Naveen Kamera1 Jan 2025 7:14 PM IST
X
Naveen Kamera Updated On: 1 Jan 2025 7:14 PM IST
2024 డిసెంబర్ 31వ తేదీ నాటికి 98.12 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పునీత్ పంచోలే బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తాము ప్రకటించిన 2023 మే 19వ తేదీ నుంచి అదే ఏడాది అక్టోబర్ 9వ తేదీ నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించామని వెల్లడించారు. రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్టు తాము ప్రకటించన 2023 మే 19వ తేదీన 3.56 లక్షల విలువైన నోట్లు చెలామణిలో ఉంటే 2024 డిసెంబర్ 31వ తేదీకి రూ.6,691 కోట్లకు తగ్గిందని తెలిపారు. దీంతో 98.12 శాతం నోట్లు వెనక్కి తిరిగి వచ్చాయని తెలిపారు. రూ.2 వేల నోటు చెలామణిలో లేకున్నా చట్టబద్ధమైన నోట్లుగా కొనసాగుతాయని వెల్లడించారు.
Next Story