Telugu Global
Business

Credit Card Bills | భారీగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా.. రీపేమెంట్ కోసం ఈ నాలుగు మార్గాలు అనుస‌రిస్తే స‌రి..!

Credit Card Bills | గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు అందుబాటులో ఉండ‌టంతో క‌నిపించిన వ‌స్తువల్లా కొనుక్కుంటూ వెళితే క్రెడిట్ బిల్లు త‌డిసిమోపెడ‌వుతుంది.

Credit Card Bills | భారీగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా.. రీపేమెంట్ కోసం ఈ నాలుగు మార్గాలు అనుస‌రిస్తే స‌రి..!
X

Credit Card Bills | గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు అందుబాటులో ఉండ‌టంతో క‌నిపించిన వ‌స్తువల్లా కొనుక్కుంటూ వెళితే క్రెడిట్ బిల్లు త‌డిసిమోపెడ‌వుతుంది. అలా కాకుండా నెల‌వారీ ఆదాయానికి లోబ‌డి క్రెడిట్ కార్డు వాడుకుంటే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, ద్ర‌వ్య యాజ‌మాన్య ప‌ద్ద‌తులు అనుస‌రించిన వార‌వుతారు. దానివ‌ల్ల సిబిల్ స్కోర్ పెరుగుతుంది.. త‌ద‌నుగుణంగా రుణ ప‌ర‌ప‌తి పెరుగుతుంది. కానీ చాలా మంది వ్య‌క్తులు త‌మ ఆదాయాన్ని మించి ఖ‌ర్చు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం అని ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు. ఆదాయాన్ని మించి క్రెడిట్ కార్డు బిల్లు పెరిగితే రీ పేమెంట్ స‌మ‌యంలో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు క‌ల వారు త‌రుచుగా ఎదుర‌య్యే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అద‌న‌పు రుణాలు తీసుకోవాల్సి వ‌స్తుంది. దీనివ‌ల్ల రుణ భారం పెరిగిపోతూ ఉంటుంది. క‌నుక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపున‌కు అనుస‌రించాల్సిన నాలుగు కీల‌క టిప్స్ గురించి తెలుసుకుందాం.. !

పలు క్రెడిట్ కార్డు సంస్థ‌లు భారీ బిల్లును ఈఎంఐలుగా మార్చుకునే సౌక‌ర్యం క‌ల్పించడం ద్వారా కార్డు దారులు త‌మ ఆర్థిక లావాదేవీలు తేలిగ్గా జ‌రుపుకునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి. ప‌లు బ్యాంకులు క్రెడిట్ కార్డు యూజ‌ర్ల కోసం సౌక‌ర్య‌వంత‌మైన కొనుగోళ్ల కోసం ఫ్రీ ఆఫ్ చార్జీ త‌రుచుగా క‌ల్పిస్తున్నాయి. అయితే, భారీ క్రెడిట్ బిల్లును ఈఎంఐలుగా మార్చుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజును జాగ్ర‌త్త‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

క్రెడిట్ కార్డు యూజ‌ర్లు త‌మ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం తెలిసి ఉండాలి. బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు యూజ‌ర్ల‌కు క్రెడిట్ ఫ్రీ పీరియ‌డ్ అందిస్తున్నాయి. ఈ క్రెడిట్ ఫ్రీ పీరియ‌డ్‌లో 30 రోజుల స్టేట్‌మెంట్ సైకిల్‌, బిల్లుల చెల్లింపున‌కు 15 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ తొలుత వ‌స్తువు కొనుగోలు తేదీ ఉంచి ప్రారంభం అవుతుంది. త‌దుప‌రి మీరు పొందే క్రెడిట్‌ను ఈ క్రెడిట్ ఫ్రీ పీరియ‌డ్‌లో గ‌రిష్టంగా వ‌డ్డీ ప్రీ పీరియ‌డ్ ఎంజాయ్ చేయ‌డంతోపాటు స‌కాలంలో బిల్లు రీ పే చేయొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఆగ‌స్టు నాలుగో తేదీన బిల్లు చెల్లింపు తేదీ ఉంటే, మీకు జూలై 18న క్రెడిట్ కార్డు బిల్లు స్టేట్‌మెంట్ జ‌న‌రేట్ అవుతుంది. జూలై 19న క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల త‌దుప‌రి నెల క్రెడిట్ బిల్లు స్టేట్‌మెంట్‌లో క‌లుస్తుంది.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపున‌కు మీరు త‌ప్ప‌నిస‌రిగా స్ప‌ష్ట‌మైన రీపేమెంట్ వ్యూహం క‌లిగి ఉండాలి. అందుకు మీరు మీ ల‌క్ష్యాన్ని శ‌ర‌వేగంగా సాధించడానికి కొన్ని ప‌ద్ద‌తులు పాటించాలి. బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లుపై క‌నీస మొత్తం చెల్లింపున‌కు ప‌ర్మిట్ చేస్తాయి. అలా ప‌ర్మిట్ చేశాయ‌ని క‌నీస మొత్తం బిల్లు మాత్ర‌మే చెల్లించార‌నుకోండి. మిగతా మొత్తంపై ప్ర‌తి రోజూ వ‌డ్డీ వ‌డ్డిస్తుంటాయి. త‌దుప‌రి నెల క్రెడిట్ కార్డు బిల్లు త‌డిసిమోపెడ‌వుతుంది. ఇది మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపున‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌రింత వ‌డ్డీరేటు పెరుగుతుంది.

ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు గ‌ల వారిలో అత్య‌ధికులు త‌మ‌కు స‌మీపంలో ఉన్న డ్యూ డేట్ బిల్లు చెల్లించడానికి ప్రాధాన్యం ఇచ్చి పొర‌పాటు చేస్తుంటారు. దానికి బ‌దులు అధిక మొత్తం వ‌డ్డీ రేటు పే చేయాల్సి వ‌చ్చే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అధిక మొత్తం గ‌ల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌డం వ‌ల్ల వ‌డ్డీ భారం త‌గ్గుతుంది.

అలా కానీ ప‌క్షంలో క్రెడిట్ కార్డు యూజ‌ర్లు త‌క్కువ బ్యాలెన్స్ బిల్లు చెల్లించ‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు పెద్ద మొత్తంలో వ‌చ్చే క్రెడిట్ కార్డు బిల్లుపై ఫోక‌స్ చేసిన‌ప్పుడు క‌నీస మొత్తం చెల్లింపుల‌కు మొగ్గు చూపాలి. దీనివ‌ల్ల వడ్డీరేటు, లేట్ ఫీజు చెల్లించాల్సి వ‌స్తుంది. ముందుగా మీ క్రెడిట్ కార్డు ఖాతాల్లో త‌క్కువ నుంచి ఎక్కువ బిల్లుల‌ను లిస్ట‌వుట్ చేసుకుంటే ముందు చిన్న బిల్లులు చెల్లించాలి. దీనివ‌ల్ల మీరు మీ రుణ చెల్లింపుల్లో త్వ‌రిత‌గ‌తిన పురోగ‌తి సాధిస్తారు. ఇదే విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్ల‌యితే క్ర‌మంగా రుణ విముక్తుల‌వుతారు.

భారీ మొత్తంలో క్రెడిట్ బిల్లు ఉన్న‌ప్పుడు, దాన్ని చెల్లించేందుకు మీ ఆదాయానికి అనుగుణంగా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌డం బెట‌ర్ అని నిపుణులు చెబుతున్నారు. అది కూడా మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మీరు రుణం పొందేందుకు అర్హుల‌వుతారు. అలా పొందిన ప‌ర్స‌న‌ల్ లోన్‌తో మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించొచ్చు. క్రెడిట్ కార్డుల బిల్లుల‌న్నీ చెల్లించ‌డానికి ప‌ర్స‌న‌ల్ లోన్ తీస‌కోవ‌డం వ‌ల్ల వ‌డ్డీ భారం త‌గ్గుతుంది. అటుపై మీరు మీ రుణ భారం నుంచి విముక్తుల‌వుతారు.

First Published:  6 Jun 2024 1:45 PM GMT
Next Story