Telugu Global
Business

Maruti Suzuki Swift | ఈ హ్యాచ్ బ్యాక్ కొత్త మైల్ స్టోన్‌.. 65 ల‌క్ష‌లు దాటిన సేల్స్‌.. శాంత్రో.. బాలెనో.. ఐ20 కానేకాదు.. !

Maruti Suzuki Swift | దేశంలోని అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో, మారుతి 800, హ్యుండాయ్ శాంట్రో, మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్‌, హ్యుండాయ్ ఐ10, హ్యుండాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనో త‌దిత‌ర కార్లు టాప్ సెల్ల‌ర్స్‌.

Maruti Suzuki Swift | ఈ హ్యాచ్ బ్యాక్ కొత్త మైల్ స్టోన్‌.. 65 ల‌క్ష‌లు దాటిన సేల్స్‌.. శాంత్రో.. బాలెనో.. ఐ20 కానేకాదు.. !
X

Maruti Suzuki Swift | గ‌తంతో పోలిస్తే క‌రోనా మ‌హమ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీ వైపు మొగ్గుతున్నారు. ఇప్పుడంటే అంద‌రూ ఎస్‌యూవీ కార్ల‌పై మన‌స్సు పారేసుకుంటున్నా.. ఒక‌ప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల‌కే గిరాకీ ఎక్కువ‌. దేశీయ కార్ల మార్కెట్‌లో ఏండ్ల త‌ర‌బ‌డి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్ల‌దే హ‌వా. దేశంలోని అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో, మారుతి 800, హ్యుండాయ్ శాంట్రో, మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్‌, హ్యుండాయ్ ఐ10, హ్యుండాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనో త‌దిత‌ర కార్లు టాప్ సెల్ల‌ర్స్‌. వాటిల్లో క్రౌట్‌. డ్ ఫుల్ల‌ర్‌గా నిలిచిందొక మోడ‌ల్.. అదే మారుతి సుజుకి స్విఫ్ట్. దేశీయ మార్కెట్‌లో 30 ల‌క్ష‌ల కార్లు అమ్ముడైన మైలురాయిని దాటేసింది స్విఫ్ట్‌. అంతే కాదు గ్లోబ‌ల్ మార్కెట్‌లో 65 ల‌క్ష‌ల పై చిలుకు స్విఫ్ట్ కార్లు అమ్ముడ‌య్యాయి మ‌రి. మారుతి సుజుకి `స్విఫ్ట్‌`కు ఉన్న డిమాండ్ అటువంటిది. గ‌త నెల‌లోనే ఫోర్త్ జ‌న‌రేష‌న్ స్విఫ్ట్‌ కారును భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది మారుతి. ఫోర్త్ జెన‌రేష‌న్ స్విఫ్ట్ కారులో సేఫ్టీ కోసం స్టాండ‌ర్డ్‌గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అమ‌ర్చారు. అంతేకాదు 2024 స్విఫ్ట్ కారులో న్యూ జ‌డ్‌-సిరీస్ ఇంజిన్‌ను జ‌త చేశారు.

ఈ నేప‌థ్యంలో భార‌త్ మార్కెట్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్‌ జ‌ర్నీ గురించి తెలుసుకుందామా..! 2005 మేలో మారుతి సుజుకి త‌న స్విఫ్ట్‌ కారును ఆవిష్క‌రించారు. 2013 న‌వంబ‌ర్‌లో ప‌ది ల‌క్ష‌ల మైలురాయిని, 2018 నవంబ‌ర్‌లో 20 ల‌క్ష‌ల మైలురాయిని, తాజాగా ఈ నెల‌లో 30 ల‌క్ష‌ల మైలురాయిని అవ‌లీల‌గా క్రాస్ చేసేసిందీ సుజుకి హ‌య్‌బుసా మోటార్ సైకిల్‌ స్పూర్తితో రూపుదిద్దుకున్న స్విఫ్ట్‌. సుజుకి మోటారు కంపెనీ ఐకానిక్ మోటారు సైకిల్ హ‌య్‌బుసా స్ఫూర్తితో త‌యారు చేసిన స్విఫ్ట్‌లో క్లైమేట్ కంట్రోల్‌, ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్ట‌మ్ వంటి ఫీచ‌ర్లు జ‌త చేసింది. ఒక హ్యాచ్ బ్యాక్ మోడ‌ల్ కారులో ఈ ఫీచ‌ర్లు జ‌త చేయ‌డం ఫ‌స్ట్ టైం.

రూ.1,450 కోట్ల ఖ‌ర్చుతో రూపుదిద్దుకున్న స్విఫ్ట్‌.. ఫోర్త్ జ‌న‌రేష‌న్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు ధ‌ర రూ.6.49 ల‌క్ష‌ల నుంచి రూ.9.59 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతోంది. అంతే కాదు 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో న్యూ జ‌డ్ సిరీస్ 1.2 లీట‌ర్ల 3-సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్ జ‌త చేశారు. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 82 పీఎస్ విద్యుత్‌, 113 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్ష‌న్‌తో వ‌స్తోంది.

మారుతి సుజుకి త‌న కార్ల‌లో అధునాత‌న‌ సేఫ్టీ ఫీచ‌ర్ల‌ను జ‌త చేస్తోంది. తాజా ఫోర్త్ జ‌న‌రేష‌న్ `స్విఫ్ట్‌`లో స్టాండర్డ్‌గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ కారు 45 శాతం హై టెన్సిల్ స్టీల్‌, 20 శాతం ఆల్ట్రా టెన్సిల్ స్టీల్‌తో త‌యారవుతోంది.

First Published:  29 Jun 2024 2:00 AM GMT
Next Story