దేశంలోని మారుమూల ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు సాదాసీదా క్రికెటర్లకు ఐపీఎల్ ద్వారా సత్తాచాటుకొనే అవకాశం వస్తుంటే…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పుత్రుడు అర్జున టెండుల్కర్ మాత్రం తనవంతు అవకాశం కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో గత రెండు సీజన్లుగా సభ్యుడిగా కొనసాగుతున్న చోటా సచిన్ అర్జున్ టెండుల్కర్ కు ఎడమచేతివాటం మీడియం పేసర్ గా, భారీషాట్లు ఆడే బ్యాటర్ గా పేరుంది. నెట్ బౌలర్ గా అనుభవం… ఇంగ్లండ్ లోని క్రికెట్ […]
Author: Telugu Global
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని అమ్మీషియా పబ్‌లో మే 28న ఒక మైనర్‌పై సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు బాలిక ఘటన జరిగిన రోజు తల్లిదండ్రులకు తనతో అసభ్యంగా ప్రవర్తించారనే చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గాని తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని చెప్పలేదు. అంతే కాకుండా పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత షాక్‌లో ఉన్న ఆ బాలిక నుంచి విషయాలు రాబట్టలేక పోయారు. బాలికను పార్టీకి తీసుకొని వెళ్లిన […]
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖలో సమన్వయ లోపం మరోసారి బయటపడింది. అధికారుల దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు ఈ అంశం రాజకీయ కోణంలోకి వెళ్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తొలుత విద్యా శాఖ ప్రకటించింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుందని ప్రెస్ నోట్ పంపారు. అందుకు తగ్గట్టుగానే మీడియా […]
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్ధాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా..సిరాజ్ ను ఆట తక్కువ…రేటు ఎక్కువ స్టార్ అంటూ ఆటపట్టించాడు. 7 కోట్ల రూపాయల. కాంట్రాక్టు సిరాజ్ కు అయాచితమేనని, సిరాజ్ లాంటి బౌలర్ ను తీసుకొని బెంగళూరు భారీమూల్యమే చెల్లించిందంటూ పలువురు విమర్శించడాన్ని సిరాజ్ తట్టుకోలేకపోతున్నాడు. ఒక్క సీజన్ వైఫల్యాన్ని చూపి తనను దండుగమారి […]
హైదరాబాద్ నుంచి గోవాకు ఓ పుట్టిన రోజు వేడుక కోసం బస్సులో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కర్నాటక అధికారులతో సమన్వయం చేసుకుంటూ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పవన్.. పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరుపనున్నారు. ఇక శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఇందులో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ సీపీనే లక్ష్యంగా పవన్ సభలు, సమావేశాలు ఉంటున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలను ఏకతాటిపైకి […]
”తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి.మసీదులు తవ్వుతాం. మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్ సినిమా రాబోతోంది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందే”. అని ఇటీవల టీబీజేపీ అధ్యక్షుడు బండి […]
భారత చెస్ దిగ్గజ ఆటగాడు, ఆల్ టైమ్ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 52 సంవత్సరాల వయసులో తిరిగి ప్రపంచ చెస్ మొదటి 10 మంది అత్యుత్తమ ఆటగాళ్ల వరుసలో నిలిచాడు. నాలుగుదశాబ్దాల తన చదరంగ జీవితంలో ఐదుసార్లు ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించిన ఆనంద్..వయసు మీరడం, యువఆటగాళ్ల దూకుడు కారణంగా గత మూడేళ్లుగా వెనుకబడిపోయాడు. టైటిల్స్ నెగ్గడం సంగతి అంటుంచి టాప్-10 ర్యాంకింగ్స్ లో సైతం నిలువలేకపోయాడు. అయితే ..గత కొద్దివారాలుగా జరుగుతున్న పలు […]
ఏపీలో వాతావరణం వేడెక్కింది. గన్నవరంలో అత్యథికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యథిక ఉష్ణోగ్రత అమరావతి(44.4 డిగ్రీలు)లో నమోదైంది. మొత్తమ్మీద ఏపీలో మరో మూడు రోజులపాటు అత్యథిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలను హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని హితవుపలికింది. రాబోయే మూడు రోజుల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా. వేసవి ప్రారంభంలో ఎండలు […]
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాలలో చేరటం కోసం బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వచ్చిన వార్త నిజం కాదని, కేవలం మీడియావర్గాల ఊహాగానమేనని తేలిపోయింది. కేవలం క్రికెట్ తోనే తన జీవితంలో మూడుదశాబ్లాల కాలం ముగిసిపోయిందంటూ దాదా ఓ చిత్రమైన ట్విట్ చేయడం గందరగోళానికి దారితీసింది. 1992 నుంచి 2022 వరకూ… 1992లో తన క్రికెట్ జీవితం ప్రారంభించిన సౌరవ్ గంగూలీ ప్రస్తుత 2022తో మూడుదశాబ్దాల కెరియర్ ను పూర్తి చేసుకొన్నాడు. బెంగాల్ […]