తెలంగాణలో మరో ఏడాదిన్నర లోపే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతీ పార్టీ తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలమైన పట్టు సడలలేదు. కానీ అర్బన్ ఏరియాల్లో మాత్రం బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఈ […]
Author: Telugu Global
దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్. కాంగ్రెస్, టీడీపీ హయాంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ది చెందేందుకు బీజం పడింది. ఇక తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరింత వేగంగా అభివృద్దిలోకి దూసుకొని పోయి మెట్రోపాలిటన్ సిటీలా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమం వైపు సరి కొత్త నగరం ఆవిర్భవించింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాత్రమే పోష్ లొకాలిటీలుగా ఉండేవి. కానీ రాన్రానూ.. రాయదుర్గం, గచ్చిబౌలి, కాజాగూడ, మణికొండ కూడా అభివృద్దిలో పోటీ […]
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌కు వెళ్లిన బాలిక (17)పై జరిగిన సామూహిక లైంగిక దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి సంబంధించిన మీడియా కథనాలను తాను పరిశీలిస్తున్నానని చెప్పారు. రెండు రోజుల్లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లు […]
ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయేమోననే ఆలోచన అందరిలోనూ ఉన్నది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న అధికార వైసీపీ, ఈ సారి అంతకు మించిన సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. అందుకే కీలక నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు ఇచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి పార్టీకి దగ్గర అయిన వారికి కూడా కొన్ని చోట్ల కీలక బాధ్యతలు అప్పగించారు. […]
క్రికెట్ మ్యాచ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లో ఆరు వరుస సిక్సర్లు బాదటం లాంటి రికార్డులు అత్యంత అరుదుగా చోటు చేసుకొంటూ ఉంటాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ లో ఇప్పటి వరకూ చేతివేళ్ల మీద లెక్కించదగినంత మంది ఆటగాళ్లు మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మొనగాళ్లుగా నిలిచారు. ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డును తలచుకోగానే గారీ సోబర్స్, హెర్షల్ గిబ్స్ ,యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కీరాన్ పోలార్డ్, లియో కార్టర్ లాంటి […]
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ ఖాయం అని గతంలోనే బీజేపీ చెప్పినా అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. వైసీపీ స్థాయిలో కాకపోయినా.. బీజేపీ కూడా నామినేషన్ కార్యక్రమానికి మేళ తాళాలతో హంగామా చేసింది. పవన్ ప్రకటన మరుసటి […]
అమరావతి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని, రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం సూచనలపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన హరగోపాల్ ఇప్పుడు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి అమరావతివాదులకు మద్దతు ఇస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు ఎందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరావతి 900 రోజుల కార్యక్రమంలో వీళ్లంతా భాగస్వామ్యులుగా మారి […]
అమరావతి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తన ఆలోచన మార్చుకోవాలని సూచించారు ప్రొఫెసర్ హరగోపాల్. ”అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు” పేరుతో అమరావతివాదుల ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసంగించిన హరగోపాల్… హైకోర్టు సమగ్రంగా పరిశీలించే అమరావతిపై తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం బాపట్ల ట్రైనింగ్ సెంటర్‌లో కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన సమయంలో… అమరావతి నిర్మాణాలు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వెళ్లి చూస్తే అప్పుడు […]
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఆ తర్వాత వైసీపీవైపు అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. టీడీపీ తరపున గెలిచిన ఆయన వైసీపీ కేడర్ తో అంత త్వరగా కలవలేకపోయారు. ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆయన పార్టీకి దూరం జరిగేందుకు నిర్ణయించుకున్నారు. సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాశారు. […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇప్పటికీ పార్ట్‌టైం పొలిటీషియన్‌గానే చాలా మంది చూస్తుంటారు. ఎన్నికల సమయంలో హడావిడి చేయడం.. ఆ తర్వాత కామ్‌గా సినిమాలు చేసుకోవడం పవన్ నైజం అయ్యింది. అయితే ఇటీవల ఏపీలో ఎన్నికల మూడ్ పెరిగిపోవడంతో పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు జనసేన-బీజేపీ పొత్తుపై బాహాటంగా ప్రకటించకపోయినా.. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం పవన్ పార్టీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. కాగా, పవన్ అసలు వ్యూహం మాత్రం […]